ఆర్థిక కష్టాలతో డ్యూటీ చేయలేకపోతున్నా..!

  • భార్యకు మెసేజ్ చేసి కానిస్టేబుల్ మిస్సింగ్
  • ఆచూకీ కోసం వనపర్తి జిల్లా పోలీసుల గాలింపు

పానుగల్, వెలుగు: ఆర్థిక కష్టాలతో డ్యూటీ చేయలేకపోతున్నానని భార్యకు మెసేజ్ చేసి కానిస్టేబుల్ అదృశ్యమైన ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం..  పానుగల్​పీఎస్ కానిస్టేబుల్ రామకృష్ణ(పీసీ 2234) మంగళవారం రాత్రి తన భార్య ఫోన్ కు ఆర్థిక ఇబ్బందులతో డ్యూటీ చేయలేకపోతున్నానని మెసేజ్ చేశాడు.

పీఎస్ నుంచి ఎస్కార్ట్  పీసీగా లాస్ట్ డ్యూటీ చేశాడు. ఆ తర్వాత నుంచి అతడు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అతని భార్య మంజుల ఫిర్యాదుతో  మిస్సింగ్ నమోదు చేసి 4 టీమ్ లతో గాలింపు చేపట్టినట్టు అడిషనల్ ఎస్పీ శ్రీరామదాసు తేజావత్ తెలిపారు.