క్యాన్సర్ తో ట్రైనీ కానిస్టేబుల్ మృతి

  • వరంగల్ జిల్లా అలంకానిపేటలో తీవ్ర విషాదం

నెక్కొండ, వెలుగు: క్యాన్సర్ తో ట్రైనీ కానిస్టేబుల్ చనిపోయిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది.  నెక్కొండ మండలం అలంకానిపేటలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన చీకటి ఉపేందర్,​-యాకలక్ష్మి దంపతుల కొడుకు రాకేశ్(24) టీఎస్​పీఎస్​ సివిల్​కానిస్టేబుల్​గా ఎంపికై హైదరాబాద్​లో శిక్షణ పొందుతున్నాడు. 15 రోజుల కింద అతనికి తీవ్ర జ్వరం రావడంతో ఒమెగా హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

డాక్టర్లు టెస్టులు చేయడంతో క్యాన్సర్ గా​నిర్ధారణ అయింది. అక్కడ చికిత్స పొందుతూనే రాకేశ్ సోమవారం ఉదయం మృతి చెందాడు. ఈనెల 27న అతడు డ్యూటీలో జాయిన్ కావాల్సి ఉంది. జాబ్​చేసి కుటుంబానికి అండగా ఉంటాడని, ఒక్కగానొక్క కొడుకు అకాల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.