బాలికతో అసభ్యంగా ప్రవర్తించిండని దాడి

  • చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
  • నిజామాబాద్ జిల్లా వీరన్నగుట్టలో ఘటన

రెంజల్(నవీపేట్), వెలుగు : బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడని వ్యక్తిపై దాడి చేయడంతో మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెంజల్ మండలం వీరన్నగుట్ట తండాకు చెందిన బాలిక గురువారం సాయంత్రం స్థానికంగా కిరాణ షాప్ కు వెళ్లింది. షాపు యజమాని రెడ్యా (55) తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులకు చెప్పింది.

దీంతో ఆవేశంగా వచ్చి రెడ్యాపై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశారు. కాగా గాయపడిన రెడ్యా ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్ బాబు సిబ్బందితో వెళ్లి తండాలో బందోబస్తు కొనసాగించారు.