వరంగల్ జిల్లలో తాగుడు వద్దన్నందుకు ఆత్మహత్య

  • వరంగల్ ​జిల్లా నెక్కొండలో ఘటన

నెక్కొండ, వెలుగు: భార్య తాగుడు వద్దన్నందుకు భర్త సూసైడ్​చేసుకున్న ఘటన వరంగల్​జిల్లాలో జరిగింది. నెక్కొండ ఎస్ఐ మహేందర్​ కథనం ప్రకారం.. టౌన్ కు చెందిన చల్లా వెంకట్​రెడ్డి(45), నాలుగేండ్ల కిందట రెండెకరాల భూమి అమ్మి కూతురు పెండ్లి చేశాడు. భూమి అమ్మాననే మనస్తాపానికి గురైన వెంకట్​రెడ్డి మద్యానికి అలవాటు పడ్డాడు. భార్య లలిత మద్యం తాగవద్దని భర్తతో తరుచూ గొడవ పడుతుంది.

దీంతో తీవ్ర మనోవేదనకు గురైన వెంకట్ రెడ్డి మంగళవారం తన వ్యవసాయ భూమిలో పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్సపొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.