కోటగిరిలో కొలువుదీరిన అయ్యప్ప స్వామి

  • అయ్యప్ప, సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవం
  • వేల మంది భక్తులతో కిటకిటలాడిన మందిరం

కోటగిరి, వెలుగు: కోటగిరి మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి కొలువుదీరారు. అయ్యప్ప, సాయిబాబాల ఆలయ ప్రారంభోత్సవం సోమవారం వైభవంగా సాగింది. దీంతో ఐదు రోజులుగా సాగిన ఆలయ ప్రాంరంభ వేడుకలు ముగిశాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త, అయ్యప్ప సాయి ఆలయ కమిటీ అధ్యక్షుడు పోల విఠల్ సేఠ్ సారథ్యంలో భక్తుల ద్వారా సేకరించిన రూ.3.5 కోట్ల విరాళాలతో మందిరాన్ని గొప్పగా నిర్మించారు.

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఆలయం కిటకిటలాడింది. ప్రతిష్టాపన అనంతరం వేద పండితులు స్వామి వారికి వెయ్యి జంటలతో సహస్ర కళశాభిషేకం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఐదురోజు కూడా అన్నదానం చేపట్టారు. కార్యక్రమానికి చీఫ్​గెస్ట్​లుగా హంపి పీఠాధిపతి స్వామి విద్యానంద భారతీ స్వామి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు.