జీపీలుగా విలీన గ్రామాలు.. ? 

  • నేడు సీఎం పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల అర్బన్ మండలం ఏర్పాటుపై ఆశలు 
  • గత సర్కార్ హయాంలో సిరిసిల్ల మున్సిపాలిటీలో కలిసిన ఏడు గ్రామాలు 
  • విలీన గ్రామాలను జీపీలుగా మార్చాలని ప్రజల డిమాండ్‌‌‌‌‌‌‌‌ 
  • సీఎం నిర్ణయంపై ఆయా గ్రామాల ప్రజల ఎదురుచూపు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల మున్సిపాలిటీలో కలిసిన విలీన గ్రామాలను తిరిగి పంచాయతీలుగా మారుస్తారన్న చర్చ నడుస్తోంది. నేడు జిల్లా పర్యటన నేపథ్యంలో విలీన గ్రామాలను జీపీలుగా మార్చి.. వీటన్నింటిని కలిపి కొత్తగా సిరిసిల్ల అర్బన్‌‌‌‌‌‌‌‌ మండలంగా ఏర్పాటు ప్రకటన చేస్తారన్న చర్చ కొనసాగుతోంది. విలీన గ్రామాలను తిరిగి జీపీలుగా మార్చాలని ఆయా గ్రామాల ప్రజలు రెండు నెలలుగా ఆందోళనలు చేస్తుండగా.. వీటిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని ఆయా గ్రామాల ప్రజలు ఆశతో ఉన్నారు. 

మున్సిపాలిటీలో కలిసిన 7 గ్రామాలు 

గతంలో సిరిసిల్ల మండలంలో ఉన్న గ్రామాల్లో మానేరు అవతలి వైపున్న వాటిని కలిపి తంగళ్లపల్లి మండలాన్ని ఏర్పాటు చేశారు. సిరిసిల్ల సమీపంలోని గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, రాజీవ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చిన్నబోనాల, పెద్దబోనాల, పెద్దూరు, సర్ధాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామాలు మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. కాగా తమ అభిప్రాయాలు, బహిరంగ చర్చ చేపట్టకుండానే అన్యాయంగా తమ గ్రామాలను మున్సిపాలిటీలో కలిపారని, ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు. తిరిగి తమ గ్రామాలను జీపీలుగా మార్చాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఈమేరకు పలుమార్లు నిరసనలకు కూడా దిగారు. 

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు లీడర్ల హామీ 

2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎమ్యెల్యే అభ్యర్థి కేటీఆర్ విలీన గ్రామాలను తిరిగి గ్రామపంచాయతీలుగా మార్చుతానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి కూడా ఓ బాండ్ పేపర్ రాసిచ్చారు.  కేకే ఎమ్యెల్యేగా ఓడిపోయినా విలీన గ్రామాల ప్రజల ఆకాంక్షలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతోపాటు వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామం అయ్యోరుపల్లిని కూడా తిరిగి జీపీగా మార్చాలని విప్ ఆది శ్రీనివాస్ సీఎంకు లెటర్ రాశారు. కాగా నేడు వేములవాడలో సీఎం పర్యటన నేపథ్యంలో ఈ ఏడు విలీన గ్రామాలతోపాటు అయ్యోరుపల్లిని కూడా తిరిగి జీపీలుగా మారుస్తూ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.