రాష్ట్రంలో పదిహేనేండ్లు దాటిన వెహికల్స్ ‌‌21.27 లక్షలు

  • ఇందులో బైక్ ‌‌లు 16.20 లక్షలు, కార్లు 2.55 లక్షలు
  • హైదరాబాద్ ‌‌లోనే అత్యధికంగా 9 లక్షల పాత వాహనాలు
  • తర్వాతి స్థానంలో రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్ ‌‌ జిల్లాలు
  • పాత వాహనాలు తుక్కుగా మారిస్తే కొత్త వాహన కొనుగోలుకు రాయితీ
  • జిల్లాకో ఆటోమేటెడ్ ‌‌ టెస్టింగ్ ‌‌ సెంటర్ ‌‌

కరీంనగర్, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలో పదినేహేండ్లు దాటిన వెహికల్స్ ‌‌ తుక్కు కింద తరలిపోనున్నాయి. 2025 జనవరి 1 నుంచి గడువు తీరిన, ప్రమాదకరమైన కాలుష్య కారక వాహనాలను స్క్రాప్ ‌‌కు పంపాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు ప్రత్యేకంగా స్ర్కాప్ ‌‌ పాలసీని సైతం ప్రకటించించింది. పదిహేనేండ్లు పూర్తికావడంతో పాటు ఫిట్ ‌‌నెస్ ‌‌ లేని వాహనాలను స్క్రాప్ ‌‌కు తరలిస్తే కొత్త వాహనం కొనేటప్పుడు ట్యాక్స్ ‌‌లో రాయితీ పొందే అవకాశం కల్పించబోతున్నారు. పదిహేనేండ్లు దాటినప్పటికీ వెహికల్ ‌‌ ఫిట్ ‌‌నెస్ ‌‌ టెస్ట్ ‌‌లో పాసైతే గ్రీన్ ‌‌ ట్యాక్స్ ‌‌ చెల్లించి అదనంగా మూడేండ్ల నుంచి ఐదేండ్ల వరకు నడిపించే చాన్స్ ‌‌ ఉంది. కానీ ఫిట్ ‌‌నెస్ ‌‌ టెస్ట్ ‌‌లో ఫెయిల్ ‌‌ అయితే మాత్రం స్ర్కాపింగ్ ‌‌కు పంపడం గ్యారంటీ. అయినా ఆఫీసర్ల కళ్లుగప్పి ఇలాంటి వెహికల్స్ ‌‌ను రోడ్డెక్కిస్తే వాటిని సీజ్ ‌‌ చేయడంతో పాటు భారీగా ఫైన్ ‌‌ విధించనున్నారు. 

రాష్ట్రంలో 21.27 లక్షల ఓల్డ్ ‌‌ వెహికల్స్ ‌‌ 

రాష్ట్రంలో 15 ఏండ్లు దాటిన అన్ని రకాల వెహికల్స్ ‌‌ కలిపి ప్రస్తుతం 21,27,912 ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ జిల్లా పరిధిలోనే 9,02,269 వాహనాలు ఉన్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 2,31,883, మేడ్చల్ ‌‌ మల్కాజ్ ‌‌గిరి జిల్లాలో 1,59,887, కరీంనగర్ ‌‌ జిల్లాలో 1,58,129, నిజామాబాద్ ‌‌లో 1,27,960, హనుమకొండ జిల్లాలో 1,23,790 వాహనాలు ఉన్నాయి. జోగులాంబ గద్వాలలో 1,245, కుమ్రంభీం అసిఫాబాద్‌లో 1,251, మహబూబాబాద్ ‌‌లో 1,299 వాహనాలు ఉన్నాయి.

స్కూల్ ‌‌ బస్సులు 3,157

పదిహేనేండ్లు నిండిన మొత్తం వాహనాల్లో మోటార్ ‌‌ సైకిళ్లు 16,20,049 ఉండగా, 2,55,145 కార్లు ఉన్నాయి. 92,489 గూడ్స్ ‌‌ వెహికల్స్ ‌‌, 68,273 ట్రాక్టర్లు, ట్రాలీలు, 49,088 ఆటో రిక్షాలు, 9,104 మోటార్ ‌‌ క్యాబ్ ‌‌లు ఉన్నాయి. అలాగే 15 ఏళ్లు నిండిన విద్యాసంస్థల బస్సులు రాష్ట్రవ్యాప్తంగా 3,157 ఉండగా.. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 752, రంగారెడ్డి జిల్లాలో 397, మేడ్చల్ ‌‌ జిల్లాలో 339, కరీంనగర్ జిల్లాలో 272 ఉన్నాయి. 15 ఏళ్ల గడువు ముగిసినా ఫిట్ ‌‌నెస్ ‌‌ టెస్ట్ ‌‌లకు వెళ్లకుండానే వేల సంఖ్యలో స్కూల్ ‌‌ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. ఇలాంటి విద్యాసంస్థల యాజమాన్యాలకు ఆర్టీఏ ఆఫీసర్లు కూడా సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

కాలం చెల్లిన వాహనాలతో ప్రమాదాలు

ఫిట్ ‌‌నెస్ ‌‌ లేని వాహనాల కారణంగానే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2022లో 15 ఏండ్లు దాటిన వాహనాల వల్ల రాష్ట్రంలో 1,306 యాక్సిడెంట్లు జరిగాయి. ఆయా ప్రమాదాల్లో 418 మంది మరణించగా... 1,100 మందికిపైగా గాయపడ్డారు. ఇలాంటి వాహనాల్లో బ్రేక్ ‌‌లు ఫెయిలవడం, క్లచ్ ‌‌ పట్టేయడం, అదుపు తప్పడంలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటాయని రోడ్డు సేఫ్టీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్క్రాపింగ్ ‌‌కు ప్రోత్సాహకాలు

వెహికల్ ‌‌ స్క్రాపింగ్ ‌‌ కోసం ప్రభుత్వం రిజిస్టర్డ్ ‌‌ వెహికల్ ‌‌ స్క్రాపింగ్ ‌‌ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయబోతోంది. స్క్రాపింగ్ ‌‌ తర్వాత సెంటర్ల నిర్వాహకులు సర్టిఫికెట్ ‌ఆఫ్ ‌‌ డిస్పోజల్‌ను ‌‌అందజేస్తారు. తర్వాత రెండేళ్ల వ్యవధిలో ఎప్పుడైనా అదే కేటగిరీకి చెందిన వాహనాన్ని కొనుగోలు చేసే టైంలో ఈ సర్టిఫికెట్‌ను అందజేస్తే వెహికల్ ‌‌ ట్యాక్స్ ‌‌లో రాయితీ ఇవ్వనున్నారు. ఇరవై ఏండ్ల లోపు ట్రాన్స్ ‌‌పోర్ట్ ‌‌ వాహనాలను స్క్రాపింగ్‌కు ఇచ్చిన తర్వాత కొత్త వెహికల్ ‌‌ కొనుగోలు చేస్తే ట్యాక్స్‌‌పై ఏటా 10 శాతం రాయితీ ఇవ్వనున్నారు.

జిల్లాకో ఆటోమేటెడ్ ‌‌ టెస్టింగ్ సెంటర్ ‌‌

వాహనాల ఫిట్‌నెస్‌ను ‌‌శాస్త్రీయంగా నిర్ధారించేందుకు ప్రభుత్వం ఆటోమేటెడ్ ‌‌టెస్టింగ్ ‌సెంటర్లు ఏర్పాటు చేయబోతోంది. 33 జిల్లాల్లో 33 సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, హైదరాబాద్‌లో అదనంగా మరో 4 సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో సెంటర్‌కు రూ.8 కోట్లు ఖర్చు చేయనున్నారు. 15 ఏండ్లు దాటిన వెహికల్స్ ‌‌ కండీషన్ ‌‌ బాగుందని ఈ సెంటర్లలో నిర్దారిస్తే మరో మూడు నుంచి ఐదేండ్లు వెహికల్ ‌‌ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వాహనాలను స్క్రాపింగ్ ‌‌కు పంపకుండా మళ్లీ రిజిస్ట్రేషన్ ‌‌ చేసుకోవాలంటే అదనంగా ట్యాక్స్ ‌‌ చెల్లించాల్సి ఉంటుంది.