ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్​లో చేరికలు

పిట్లం, వెలుగు : జుక్కల్​ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావు సమక్షంలో పిట్లం మండలం అన్నారంలో పలువురు కాంగ్రెస్​ పార్టీలో చేరారు.  ఆదివారం అన్నారానికి వచ్చిన సందర్భంగా పలువురు యువకులు, పెద్దలు పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థి సురేశ్ షెట్కార్​భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.