ఈడీ సంచలన విషయాలు బ్యాంక్ లోన్స్ పేరుతో రూ.65వేల కోట్లు కొట్టేశారు

గత కొంతకాలంగా  ఎన్ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ అక్రమాస్తులు సంపాధిస్తున్న వారిపై నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే తరుచూ అనుమానస్తులపై రైడ్స్ చేయడం, లెక్కలు చూపని డబ్బును సీజ్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ లోన్స్ పేరుతో బ్యాంకులను మోసం చేసి ఇప్పటి వరకు రూ.65,279 కోట్లు కొట్టేశారని ED మీడియాకు వెల్లడించింది. గత కొన్ని సంవత్సరాలుగా వీటిపైనా1,160 మనీ లాండరింగ్ కేసులు బ్యాంక్ లోన్ ఫ్రాడ్స్ చేసినవే ఉన్నాయని ED వివరించింది. 

ఆయా కేసుల్లో 174 మందిని అరెస్ట్ చేశారట. బ్యాంకులను మోసం చేసి సంపాధించిన రూ.65,279 కోట్లను ఎన్ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. దాదాపు రూ.15,185 కోట్లు ఇప్పటికే రుణాలిచ్చిన బ్యాంకులకు తిరిగి ఇచ్చేసింది ఈడీ. ఆర్థిక నేరాలకు పాల్పడి పారిపోయిన వారికి సంబంధించి రూ.725 కోట్లు జప్తు చేయబడ్డాయని ఈడీ తెలిపింది. 

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద వచ్చే కేసుల కోసం ఏర్పాటు చేసిన కోర్టు ముందు ఇప్పటికీ 473 ప్రొవిజనల్ అర్డర్స్, 314 ప్రాసిక్యూషన్ కంప్లైయింట్స్(చార్జిషీట్లు దాఖలు చేసి) ఉన్నాయని ఈడీ వెల్లడించింది. కొన్ని కేసుల్లో ట్రయల్స్ అయిపోయి  ఎనిమిది మంది నిందితులు దోషులుగా నిర్ధారించబడ్డారు. సుమారు రూ.15,295 కోట్లు జప్తు చేశారు.