స్టూడెంట్లు ఉన్నత లక్ష్యాలు సాధించాలి : ఆకునూరి మురళి

  • విద్యా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఆకునూరి మురళి

రాజన్న సిరిసిల్ల/తంగళ్లపల్లి, వెలుగు : స్టూడెంట్లు ఉన్నత లక్ష్యంతో విద్యను అభ్యసించాలని విద్యా కమిషన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలోని బాయ్స్‌‌‌‌‌‌‌‌ హాస్టల్‌‌‌‌‌‌‌‌, ఇల్లంతకుంటలోని ఎస్సీ గర్ల్స్‌‌‌‌‌‌‌‌ హాస్టల్‌‌‌‌‌‌‌‌ను ఆదివారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ ఝాతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌‌‌‌‌‌‌‌ ఆవరణ, పరిసరాలు, వసతి గదులు, కిచెన్‌‌‌‌‌‌‌‌, స్టోర్‌‌‌‌‌‌‌‌రూంలో ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లను పరిశీలించారు.

అనంతరం స్టూడెంట్లను కలిశారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ విద్యార్థులు విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఇష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు. కాంపిటీటివ్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌లో రాణించేలా స్టూడెంట్లను తీర్చిదిద్దాలని టీచర్లకు చెప్పారు. వారి వెంట డీఈవో రమేశ్‌‌‌‌‌‌‌‌కుమార్, బీసీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ రాజమనోహర్ ఉన్నారు.