జహీరాబాద్ ​నుంచి బీబీ పాటిల్​నిజామాబాద్ ​నుంచి అర్వింద్..

  •     ఇందూరు నుంచి రెండోసారి బరిలో యువనేత
  •     పార్టీ మారిన మర్నాడే జహీరాబాద్ ​టికెట్​ దక్కించుకున్న పాటిల్​ 

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ ​సిట్టింగ్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ మరో సారి ఇందూరు ఎంపీ బరిలో నిలువనున్నారు. శనివారం పార్టీ అధిష్టానం ఆయన పేరును ఖరారు చేసింది. పొలిటికల్​ఫ్యామిలీ బ్యాగ్రౌండ్​ఉన్న అర్వింద్​ బీజేపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని షురూ చేశారు. 2019 లో మొదటి సారి ఇందూరు నుంచి బరిలో నిలిచి  సంచలన విజయాన్ని నమోదు చేశారు. బీఆర్ఎస్​చీఫ్​కేసీఆర్​ తనయ కవితను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఎంపీగా గెలిచాక సెగ్మెంట్​లో పార్టీపై పూర్తి పట్టు సాధించారు.

గడిచిన ఐదేండ్లు కేసీఆర్,​ ఆయన కుటుంబ సభ్యులపై పదునైన కామెంట్లతో క్రేజ్​ లీడర్ గా ​గుర్తింపు సాధించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నిక్లో కోరుట్ల నుంచి పోటీ చేసి ఓడినా, ఆర్మూర్, అర్బన్​లో పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలకంగా వ్యవహరించారు. ఎంపీ టికెట్​తనకే తక్కుందనే ధీమాతో 20 రోజుల నుంచే ప్రచారం షురూ చేశారు. మరో ఇద్దరు నేతలు టికెట్​ఆశించినా అర్వింద్​దరిదాపుల్లోకి రాలేకపోయారు. అర్వింద్​కు టికెట్​ఇవ్వొద్దని కొందరు నిరసన తెలిపినా అధిష్టానం మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు.

చేరికతోనే టికెట్​

కామారెడ్డి: జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం అనూహ్యంగా బీబీపాటిల్ ​పేరును ప్రకటించింది. పార్టీలో చేరిన మరుసటి రోజే ఆయనకు టికెట్​ రావడం విశేషం. బీఆర్ఎస్​ సిట్టింగ్ ​ఎంపీగా ఉన్న ఆయన శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్​కు పంపిన కొన్ని నిమిషాల్లోనే ఢిల్లీలో బీజేపీలో చేరారు. పార్లమెంట్​ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్​ను బీజేపీ శనివారం రిలీజ్​చేసింది.

ఇందులో జహీరాబాద్​ క్యాండిడేట్​గా బీబీపాటిల్ ​పేరును ఖరారు చేశారు. ఈయన వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్​నుంచి పోటీ చేసి గెలుపొందారు. జహీరాబాద్​ బీజేపీ టికెట్​కోసం పలువురు నేతలు పోటీ పడ్డారు. పార్లమెంట్​పరిధిలో బీబీ పాటిల్​సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం, సిట్టింగ్ ​ఎంపీ అయినందున అధిష్టానం ఆయనకే టికెట్​ఖరారు చేశారు.