భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ శ్రీకృష్ణ దేవరాయ ఉన్నత పాఠశాల (ఎస్కేడీఆర్) 1998–99 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరభధ్రయ్య, కోటి, సారయ్య, రాజయ్య, సంపత్, విద్యార్థులు పాల్గొన్నారు.