చలి కాలంలో.. గరం గరం సూప్స్

పొగమంచు, గజగజ వణికించే చలి.. ఒక్కోసారి చలికాలంలో రోజంతా ఇబ్బందే. అందుకే చలికాలంలో ఇలా ఇబ్బంది పడేవాళ్లు కొన్ని సూప్స్ తాగితే చల్లటి చలిలో గరం గరంగా గడిపేయొచ్చు..

పాలకూర సూప్

చలికాలం రాత్రిళ్లు బాడీ లేజీగా ఉంటుంది. చల్లగా అయిన కూరలు, అన్నం తినడం.. అంటే కష్టం. అందుకే డిన్నర్లో అయినా, లంచ్ అయినా పాలకూర ఉంటే ఒంటికి తగిన వేడి అందుతుంది. శరీరం యాక్టివ్గా కూడా ఉంటుంది. అబ్బా! రోజూ పాలకూర, పాలకూర పప్పు అంటే బోర్ అనిపిస్తుంది కొందరికి. అలాంటి వాళ్లు 'పాలక్ సూప్' చేసుకొని లంచ్, డిన్నర్లో యాడ్ చేసుకోవచ్చు. పాలకూరను చిన్నగా తరిగి, తాలింపు వేశాక.. నీళ్లతో మిక్స్ చేసి బాగా రుబ్బాలి. అది క్రీమీగా తయారవుతుంది. రాత్రి భోజనంలో దీన్ని తిని పడుకుంటే చలి అంతగా అనిపించదు!

కంది, శనగ పప్పు రసం

శనగ, కంది పప్పు ఏసీజన్ లో అయినా మంచి న్యూట్రిషన్ ఇంగ్రేడియెంట్స్. వీటి కాంబినేషన్లో ఎన్నో రెసిపీలు ఉంటాయి. అయితే వింటర్ లో వీటిని కాస్త వెరైటీగా వాడితే.. భోజనం మరింత బాగుంటుంది. చలికాలంలో చాలామంది రాత్రి భోజనం మీద ఆసక్తి చూపరు. అలాంటి వాళ్లు శనగపప్పు, కంది పప్పు సూప్ ను ట్రై చేస్తే.. టేస్టీకి టేస్టీ, బాడీకి వేడి అందుతుంది. పైగా వాతావరణం మరీ చల్లగా ఉన్నాకూడా తినాలన్న ఆసక్తి పెరుగుతుంది. శనగ, కంది పప్పులను తాలింపు వేసి బాగా మిక్స్ చేయాలి. రసంలా అయ్యాక వేడి వేడి అన్నంతో కలిపి తింటే. చలికాలం అన్న సంగతే గుర్తురాదు.

బీట్ రూట్ చికెన్ సూప్

బీట్ రూట్ అందరికీ కామన్ దొరికే వెజిటబుల్ అనేక పోషకాలు ఉంటాయి ఇందులో. బీట్ రూట్ను వాడి చికెన్ సూప్ తయారు చేసుకుంటే చలికాలంలో ఎంతో ఉపయోగం. దీన్ని తయారు చేయడం కూడా ఈజీనే. చికెన్ ముక్కలతో పాటు బీట్ రూట్ ముక్కలను కలిపి ఉడకబెట్టాలి. నల్ల మిరియాలు, అల్లం వేసి బాగా కలపాలి. చివరగా నీళ్లు పోసి, చికెన్ మసాలాలు చల్లాలి. పూర్తిగా మరిగాక గార్నిష్ కోసం కొత్తిమీర ఆకులు వేసుకుంటే.. చూడ్డానికి బ్యూటిఫుల్ గా టేస్టీగా ఉంటుంది.