బెంగళూరు: బెంగళూరులోని వయాలికావల్ ఏరియాలో ఓ వివాహితను(29) చంపి, ఆమె డెడ్ బాడీని 59 ముక్కలుగా నరికిన కేసులో మిస్టరీ వీడింది. ఆమెను అంత కిరాతకంగా హత్య చేసింది ఆమెతో పాటు పనిచేసిన సహోద్యోగేనని పోలీసులు తేల్చారు. భర్తతో విడిపోయాక ఆమె బెంగళూరుకు చేరుకుని అక్కడే ఒక షాపింగ్ మాల్లో పనిచేసేది.
ముక్తి అనే ఈ హంతకుడు, బాధితురాలు మహాలక్ష్మి ఒకే షాపింగ్ మాల్లో పనిచేసేవారు. ఇద్దరికీ 2023లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో నేరస్తుడు ఇంత కిరాతకంగా ఆమెను హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నేరస్తుడి సోదరుడితో పాటు మరో ఇద్దరిని బెంగళూరు పోలీసులు ఇప్పటికే విచారించారు. ఆమెను తానే హత్య చేసినట్లు నేరస్తుడు అతని సోదరుడికి కాల్ చేసి చెప్పినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ALSO READ | ఆమె డెడ్‌బాడీ 30 ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో.. కేసులో కీలక విషయాలు వెలుగులోకి
వయాలికావల్‌లోని మున్నేశ్వర్ బ్లాక్ మొదటి అంతస్తులో మహాలక్ష్మిని 59 ముక్కలుగా నరికి ఆమె మృతదేహాన్ని నేరస్తుడు రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. శరీర భాగాలు నాలుగైదు రోజులుగా ఫ్రిజ్‌లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రిఫ్రిజిరేటర్లో ఆమె శరీర భాగాలు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు దిగ్భ్రాంతికి లోనైన పరిస్థితి. మహాలక్ష్మి స్వస్థలం కర్నాటక కాదు. ఆమె వేరే రాష్ట్రం నుంచి వచ్చి కొంతకాలంగా షాపింగ్ మాల్లో పనిచేస్తూ ఒంటరిగా ఉంటోందని పోలీసుల తెలిపారు. గత శనివారం (సెప్టెంబర్ 21, 2024) ఉదయం ఆమెను చూసేందుకు తల్లి, -చెల్లెలు రావడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.