కార్తీక పురాణం విశిష్ఠత : మహా విష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన కథేనా..!

Karthika Masam Special 2023:కార్తీకమాస వైశిష్ట్యం, దాని ప్రాముఖ్యత అందరికి తెలిసినదే. అయితే కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివితే ఎంతో పుణ్యమని పెద్దలు .. పురాణ పండితులు చెబుతున్నారు.  అంతేకాక కార్తీక పురాణాన్ని  మహావిష్ణువు.. లక్ష్మీ దేవికి, శివుడు .. పార్వతీ దేవికి,  బ్రహ్మ ..నారదుడికి  వివరించారని పండితులు చెబుతున్నారు.    అసలు కార్తీక పురాణం అంటే ఏమిటి.. పారాయణం చేయడం వలన వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి..కార్తీక పురాణం ఎలా పఠించాలో ఇప్పడు తెలుసుకుందాం. 

అసలు ఏమిటీ కార్తీకపురాణం..

ముప్పై రోజులు ఉండే కార్తీకమాసంలో ప్రతిరోజు ఆ పరమేశ్వరుడిని పూజిస్తూ, ధ్యానిస్తూ, భక్తి పారవశ్యంలో మమేకమవుతూ పురాణాలలో తెలుపబడిన కార్తీకపురాణాన్ని ప్రతిరోజు ఒకో అధ్యాయంగా పఠిస్తారు. అయితే ఈ కార్తీకపురాణం ఏమిటి అంటే ఆ పరమేశ్వరుడి లీలలు, ఆ పరమేశ్వరుడిని పూజించడం, ధ్యానించడం, కార్తీక సోమవారం వ్రతం పాటించడం. తద్వారా కలిగే మార్పులు, చేకూరే ప్రయోజనాలు, తొలగే కష్టాలు ఇలాంటి ఎన్నో చిత్ర విచిత్రమైన  కృత యుగం కాల ప్రజల అనుభవాల సమాహారమే కార్తీక పురాణం. ఈ కార్తీక పురాణాన్ని శివుడు .. పార్వతీ దేవికి,  బ్రహ్మ ..నారధుడికి, మహావిష్ణువు.. లక్ష్మీ దేవికి చెప్పారని, తరువాత వశిష్ఠ మహర్షి .. జనక మహారాజుకు చెప్పగా ఆయన కార్తీక పురాణం విని కార్తీక మాసం మొత్తం ఆ విధంగా అనుసరించి దాన్ని భూలోక ప్రజలకు విస్తృతంగా తెలియపరిచాడని ప్రతీతి.

ఫలితం ఏమిటి?

మనం వెళ్లాల్సిన ఊరికి తప్పనిసరిగా బస్ లేదా ఇతర వాహనాలు ఏవో ఒకటి ఎక్కాలి, వాటికి డబ్బు వినియోగించాలి. మన ప్రయాణం సౌకర్యంగా ఉండాలంటే సీటు దొరకాలి.. ఇలా ఉంటే ఎంచక్కా ఎలాంటి సమస్య లేకుండా వెళ్లిపోతాం. అట్లాగే హిందూ సంప్రదాయంలో ఉన్న నమ్మకాలను ప్రామాణికంగా తీసుకుంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో, ఆ పరమేశ్వరుడు స్వయంగా పార్వతీ దేవికి చెప్పిన ఈ కార్తీక మాస విశిష్టతను, దాని నియమాలకు అనుగుణంగా పాటించడం వల్ల ఆ కైలాసవాసుని కరుణా కటాక్షాలు లభించి మోక్షాన్ని పొందుతారని, మరణానంతరం కైలాస ప్రాప్తి కలుగుతుందని పురాణం కథనాలు మరియు ఎన్నో కథనాల ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి కథల సమాహారమే కార్తీక పురాణం.

కార్తీక పురాణం ఎలా చదవాలి?

కార్తీక మాసంలో ఈ పురాణాన్ని చదవాలి.  ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసుకుని, ఉపవాసం ఉండే వారు నియమాలు ప్రకారం ఉపవాసం ఉండి తరువాత సాయంత్రం శుభ్రంగా కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కుని దగ్గరలో ఉన్న శివాలయం, లేదా ఏదైనా విష్ణు స్వరూప ఆలయానికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని అటు తరువాత ఇంట్లో తులసి కోట వద్ద దీపం వెలిగించి మాస ప్రారంభం నుండి కార్తీక పురాణం లో పేర్కొన్నట్టు రోజుకొక ఆధ్యాయం  చదవాలి. చదవగానే అయిపోయిందని కాదు, అందులో ఉన్న నిఘాడార్థం, దాని తాలూకూ విషయం, దాన్ని జీవితంలో ఎలా పాటించాలి వంటివి అవగాహన చేసుకోవాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ కార్తీక పురాణం ప్రతీ కథలో ఏదో ఒక నీతి ఉండనే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని నిజ జీవితంలో పాటిస్తే జీవితంలో ఎంతో గొప్ప మార్పు  చోటుచేసుకుంటుంది.కాబట్టి కార్తీకమాసంలో కార్తీక పురాణాన్ని పఠించడం మరవకండి. సాధారణ రోజులకంటే ఎంతో గొప్ప పలితాన్ని ఈ మాసంలో పొందవచ్చుని పురాణాలు చెబుతున్నాయి.

ALSO READ :- అరడజన్ ప్లాప్స్తో జపాన్​ బ్యూటీ..కార్తి కూడా హ్యాండిచ్చేసాడు