దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై అభిశంసన తీర్మానం రద్దు చేయబడింది. దేశంలో మార్షల్ లా ప్రకటించడానికి యూన్ తీసుకున్న చర్యపై ప్రతిపక్ష పార్టీలు యూన్‌పై విధించిన అభిశంసనకు పాలక పార్టీ సభ్యులు బహిష్కరించడంతో విఫలమైంది.
ఓవైపు యూన్ అధ్యక్ష పదవినుంచి తొలగించాలని దక్షిణ కొరియా ప్రజలు నిరసనలు చేస్తున్నారు. దక్షిణ కొరియాలో ఎక్కువ మంది ప్రజలు అధ్యక్షుడి అభిశంస నకు మద్దతిస్తున్నారని అక్కడి సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ కొరియాలో రాజకీయ గందరగోళం ఏర్పడింది.
యూన్ మార్షల్ లా డిక్లరేషన్ తర్వాత సొంత పార్టీ కన్వర్జేటివ్ పార్టీ నుంచి విమర్శలు వచ్చాయి. అయితే యున్ అభిశంసనను మాత్రం వ్యతిరేకించాలని పార్టీ నిర్ణ యించినట్టు తెలుస్తోంది. యున్ అభిశంసన మద్దతిస్తే ఉదారవాదులకు అధ్యక్ష పదవి పోతుందని ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.

యున్ అభిశంసనకు జాతీయ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మంది లేదా 300 మంది సభ్యుల్లో 200 మంది మద్దతు అవసరం. అభిశంసన తీర్మానాన్ని తీసు కొచ్చిన ప్రతిపక్ష పార్టీలకు చెందిన 192 సీట్లు ఉండగా..పీపీపీకి చెందిన ముగ్గురు శాసన సభ్యులు మాత్రమే ఓటింట్ లోపాల్గొన్నారు. ఓట్ల సంఖ్య 200 కి చేరుకోనందున బ్యాలెట్ లెక్కింపు లేకుండానే మోషన్ రద్దు చేశారు.