రాజన్న ఆలయంలో ఘనంగా పూర్ణాహుతి

  •  ధర్మగుండంలో వినాయకుడి నిమజ్జనం


వేములవాడ, వెలుగు :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలోని నాగిరెడ్డి మండపంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద ఆదివారం ఆలయ అర్చకుల ఆధ్యర్యంలో ఘనంగా పూర్హాహుతి నిర్వహించారు. వినాయకుడికి తొమ్మిది రోజుల పాటు ఉదయం, సాయంత్రం అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వినాయకుడిని పుర వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. రాజన్న ఆలయ ధర్మగుండంలో వినాయకుడిని నిమజ్జనం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఆలయ ఈఓ వినోద్ రెడ్డి, ఏఈఓలు శ్రావణ్​, బ్రహ్మన్నగారి శ్రీనివాస్ పాల్గొన్నారు.