టెక్నాలజీ : రోజుకు 80 సార్లు?

ఇవ్వాళరేపు ఎక్కువమంది చేతిలో స్మార్ట్​ ఫోన్​ లేని క్షణాన్ని ఊహించుకోవడం కష్టమే. అంతలా అలవాటు పడిపోయారు జనం. ఫోన్​తో అవసరం ఉన్నా, లేకపోయినా దాన్ని మాత్రం వదలట్లేదు. అయితే, ‘గ్లోబల్​ మేనేజ్​మెంట్​ కన్సల్టింగ్​ ఫర్మ్​’​ స్మార్ట్​ ఫోన్​ వాడకంపై చేసిన సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఆ సర్వేలో భాగంగా దాదాపు వెయ్యి మంది స్మార్ట్​ ఫోన్ యూజర్లను అడిగి తెలుసుకున్న వివరాలు ఇవి.. 

దాదాపు 50 శాతం మంది ఫోన్​ చేతిలోకి తీసుకుంటున్నాం అనే విషయం తెలియకుండానే  తీసుకుంటున్నారట.
స్మార్ట్ ఫోన్ యూజర్లు రోజులో 70 నుంచి 80 సార్లు ఫోన్ చేతిలోకి తీసుకుంటున్నారు. 
 50శాతం మంది ఎందుకు ఫోన్​ ఓపెన్ చేస్తున్నారో కూడా తెలియకుండానే ఓపెన్ చేస్తున్నారు. 
 45 నుంచి 50 శాతం మందికి మాత్రం తాము ఫోన్​ను ఎందుకు వాడుతున్నారో క్లారిటీ ఉంది.
 మనదేశంలో 50 నుంచి 55 శాతం స్మార్ట్​ ఫోన్ యూజర్లు యాప్స్​ వాడుతున్నారు. వాటిలో వీడియో స్ట్రీమింగ్​, షాపింగ్, ట్రావెల్, జాబ్స్​కు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. 

టెక్నాలజీలో వస్తున్న మార్పుల వల్ల స్మార్ట్​ఫోన్​లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగింది. అందువల్ల యూజర్లు ఫోన్​తో ఉండే టైం మరింత పెరిగే అవకాశం ఉంది’ అంటున్నారు 

ఎక్స్​పర్ట్స్.