RG కర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సస్పెండ్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం,హత్య కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్  ను (ఐఎంఏ) ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది.

డాక్టర్ ఘోష్ తన ప్రవర్తన వల్ల డాక్టర్ వృత్తికి చెడ్డపేరు తెచ్చారని  క్రమశిక్షణా కమిటీ అతన్ని జాతీయ వైద్య సంఘం సభ్యత్వం నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని నిర్ణయించిందని ఐఎంఏ తెలపింది. అంతేగాకుండా  బాధితురాలి తల్లిదండ్రులకు మనోవేదన గురయ్యేలా చేశారని  వెల్లడించింది. ఈ కేసులో డాక్టర్ సందీప్ ఘోష్ ను సీబీఐ ఇప్పటికే విచారించింది. 

 ట్రైనీ డాక్టర్ హత్యను  డాక్టర్  సందీప్  ఘోష్ ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు బాధితురాలి తల్లిదండ్రులకు చెప్పాడు. అంతేగాకుండా తల్లిదడ్రులను ఆమె మృతదేహాన్ని  చూడటానికి అనుమతించేందుకు 3 గంటల పాటు వేచి చూసేలా చేశాడు. దీనిపై పెద్ద ఎత్తును ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. 

ALSO READ | ఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం సహించదు:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము