గంగోనికుంటలో అక్రమ నిర్మాణాలు

  • కుంటలో మట్టి పోసి  పూడ్చిన కబ్జాదారులు 

హుజూరాబాద్, వెలుగు :  హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని గంగోనికుంట కబ్జాకు గురవుతోంది. కబ్జాదారులు బిల్డింగ్స్ కూల్చిన వ్యర్థాలను తరచూ కుంటలో పోస్తూ ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2477‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కుంట విస్తీర్ణం12.16 ఎకరాలు ఉండగా.. ఇప్పుడు 5 ఎకరాలకు తగ్గిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బఫర్ జోన్, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దాటి కుంటలో  కబ్జాలు జరుగుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

శిఖం పట్టాను ఆసరాగా చేసుకుని కొందరు ఈ భూమిని ప్లాట్లుగా అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వెంటనే కుంటను సర్వే చేసి హద్దులు నిర్ధారించి, కబ్జాలను కట్టడి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.