ఇళయరాజా ఆలయ వివాదం: నేను ఆత్మగౌరవం విషయంలో రాజీ పడను: ఇళయరాజా

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించగా.. అక్కడ ఉన్న జీయర్లు అడ్డుకోవడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ మండపం ద్వారా గర్భగుడిలోకి కేవలం జీయర్లకు మాత్రమే అనుమతి ఉందని తెలిపిన జీయర్లు ఇళయారాజాను అనుమతించేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో ఆలయ సిబ్బంది ఆలయ నిబంధనలను ఇళయరాజాకు వివరించగా.. బయటకు వెళ్లి అక్కడి నుంచే పూజలు చేశారు ఇళయరాజా. ఈ ఘటనపై ఇళయరాజా అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ వివాదంపై స్పందించారు ఇళయరాజా. ఈ మేరకు ఎక్స్ లో ఓ ట్వీట్ ద్వారా వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు ఇళయరాజా.

శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయ గర్భగుడిలోకి వెళ్తున్న తనను బయటకు వెళ్లిపోవాలని జీయర్లు చెప్పినట్లు వస్తున్న వార్తలను ఖ్నదించారు ఇళయరాజా. తన చుట్టూ కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని... తాను ఏ సమయంలోనైనా.. ఎక్కడైనా, తన ఆత్మగౌరవం విషయంలో రాజీపడే వ్యక్తిని కాదని అన్నారు ఇళయరాజా.

 

జరగని విషయాన్ని కూడా జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారని... అభిమానులు, ప్రజలు ఈ పుకార్లను నమ్మొద్దంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు ఇళయరాజా.