కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌లోని అల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో బుధవారం మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ బీరయ్య బైరె ఆధ్వర్యంలో జామ్–2025(జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎమ్మెస్సీ) ఎంట్రన్స్ టెస్ట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా బీరయ్యబైరె మాట్లాడుతూ పీజీ చేసే స్టూడెంట్లకు విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. కరస్పాండెంట్ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ డిగ్రీ పూర్తయిన విద్యార్థులు ఐఐటీల్లో పీజీ సీటు సాధించేందుకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నామన్నారు.