ఉల్లిపాయ... ఆనియన్.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని చాలమంది రోజూ తింటారు. ఎందుకంటే ఉల్లిపాయ లేనిదే ఏ వంటకం రుచిగా ఉండదు. అంత ప్రాముఖ్యత ఉంటుంది ఉల్లిపాయకు. అయితే అలాంటి ఉల్లిపాయను ఉపవాసాల పేరుతో వారాలు, నెలల తరబడి తినకుండా ఉంటారు. ఉల్లిపాయను తినకపోవడం వల్ల శరీరంలో మార్పులు జరుగుతాయట. అసలు ఇలా ఎప్పుడైనా జరుగుతుందని గమనించారా. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతీ ఇంట్లో ఉండే కూరగాయల్లో ఉల్లిపాయ ముఖ్యంగా ఉంటుంది . ఉల్లి పాయను పచ్చిగా తింటే నోరు కంపుకొడుతుంది. అందువల్ల ఉల్లిపాయను కూరల్లో వేసుకుని తీనడం వల్ల దాని రుచే మారిపోతుంది. ఉల్లిపాయల్లో విటమిన్ సి, ఫోలేట్, బీ6 వంటి పోషకాలు ఉంటాయట. ఉల్లిపాయను తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి, ఆరోగ్యమైన జీవక్రియను నిర్వహించడంలో సహాయపడుతుందట. ఉల్లిపాయను తినడం వల్ల శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరానికి చేరుతాయట. అంతేకాదు వీటిలోని యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా శరీరానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఉల్లిపాయను పవర్ హౌస్ అని పిలుస్తారు.
ఉల్లిపాయలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచేందుకు తోడ్పడుతుంది. అయితే ఉల్లిపాయను కొన్ని రోజుల తరబడి తీసుకోకపోవడం వల్ల ఫైబర్ తగ్గిపోతుందట. అంతేకాదు మలబద్ధకం, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయట. అంతేకాదు ఆక్సీకరణ ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధులు వంటి ప్రమాదాలను కూడా పెంచే అవకాశాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఉల్లిపాయను తరచూ ఆహారంలో తీసుకోకపోవడం వల్ల శరరీంలో పోషకాల లోపం తలెత్తే ఛాన్స్ ఉంటుంది. మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా లోపిస్తాయట. శరీరానికి కావాల్సిన విలువైన పోషకాలు ఉల్లిపాయ తినకపోవడం వల్ల కోల్పోయే అవకాశాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.