Good Health : 20 సెకన్లు ఈ ఆసనం వేస్తే.. ఆ అనారోగ్యం దూరం

చిన్నాపెద్దా తేడా లేకుండా ఈ మధ్య అందర్నీ ఇబ్బంది పెడుతోంది యూరిన్ లీకేజ్. అయితే ఈ సమస్యకి మలాసనంతో చెక్ పెట్టొచ్చు. మొదట యోగా మ్యాట్పై రెండు కాళ్లని దూరంగా ఉంచి నిలబడాలి. తర్వాత నెమ్మదిగా ఫొటోలో చూపించినట్టు చేతులను నమస్కార ముద్రలో ఉంచి కూర్చోవాలి. 

వెన్నెముక నిటారుగా ఉంచాలి. అలాగే రెండు మోకాళ్ల మధ్యలో నమస్కార ముద్ర ఉండాలి. ఈ పొజిషన్ లో 15 నుంచి 20 సెకన్లు ఉండాలి. తరువాత ఆసనం నుంచి నెమ్మదిగా బయటకు రావాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే యూరిన్ లీకేజ్ పాటు యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి.