Telegram: టెలిగ్రామ్‌పై నిషేధం! ప్రత్యామ్నాయ యాప్‌లు ఇవే

అశ్లీలత, పైరేటెడ్ కంటెంట్, ద్వేషపూరిత ప్రసంగాలు, తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిన టెలిగ్రామ్‌పై నిషేధం పడనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అక్రమ కార్యకలాపాలతో పాటు భారతదేశ ఐటీ నిబంధనలను టెలిగ్రామ్‌ పాటిస్తున్నదా! లేదా..! అన్న దానిపై హోంశాఖ, ఐటీ శాఖ సహకారంతో ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌(ఐ4సీ) విచారణ జరుపుతోంది. ఈ విచారణలో నిబంధనలకు విరుద్ధంగా ఈ యాప్ పని చేస్తున్నట్లు తేలితే నిషేధించే అవకాశం ఉంది. 

ఒకవేళ టెలిగ్రామ్‌పై నిషేధం పడితే.. ప్రత్యామ్నాయ యాప్‌లు ఏవనేది తెలుసుకుందాం. అందునా గోప్యత, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఐదు సురక్షితమైన యాప్‌లు ఇవి. 

వాట్సప్(WhatsApp)

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో జనాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్‌ను ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఇది వ్యక్తిగత చాటింగ్, గ్రూప్ చాట్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, స్టేటస్ అప్‌డేట్లు, ఆన్‌లైన్ పేమెంట్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇది మొదటి ఎంపిక అని చెప్పుకోవాలి.

సిగ్నల్(Signal): గోప్యత కోసం గోల్డ్ స్టాండర్డ్

గోప్యత, భద్రతకు ప్రాధాన్యతనిచ్చే వినియోగదారులకు సిగ్నల్ అగ్ర ఎంపిక. ఇందులో గ్రూప్ చాట్, స్టేటస్ అప్‌డేట్‌లు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ మెసేజ్‌ల కోసం ఆటో-డిలీట్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఎదుటి వారు స్క్రీన్‌షాట్లు తీసుకోకుండా నిరోధించడానికి స్క్రీన్ భద్రత ఫీచర్లు ఉన్నాయి.

Also Read :- నేవీలో ఐఎస్ఐ గూఢచర్యం కేసు..

బ్రోసిక్స్(Brosix): వ్యాపారాల కోసం సురక్షితమైన ఎంపిక

బ్రోసిక్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో సురక్షితమైన సందేశాలు అందిస్తోంది. ఇది అంతర్గత వ్యాపార కమ్యూనికేషన్‌కు అనుకూలంగా ఉంటుంది. చాట్ రూమ్ నియంత్రణలు, చాట్ హిస్టరీ ఆర్కైవ్‌లు, వర్చువల్ వైట్‌బోర్డ్, స్క్రీన్ షేరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యాప్ ను వ్యాపారాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు.

మేటర్‌మోస్ట్(Mattermost): IT, కార్పొరేట్ పరిసరాలకు అనువైనది

మ్యాటర్‌మోస్ట్ టీమ్ కమ్యూనికేషన్ కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తోంది. ప్రైవేట్ చాట్ రూమ్‌లు, ఫైల్ షేరింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులోనూ ఇతర యాప్ ల వలె వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, గ్రూప్ చాట్, స్టేటస్ అప్‌డేట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. సంస్థ యొక్క నిర్దిష్ట అవసరాలకు సరిపోయేలా మ్యాటర్‌మోస్ట్‌ను వినియోగించవచ్చు. IT మరియు కార్పొరేట్ వాతావరణాలకు Mattermost బాగా సరిపోతుంది.

మైక్రోసాఫ్ట్ టీమ్స్(Microsoft Teams)

ఇది కేవలం ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ మాత్రమే కాదు.. మైక్రోసాఫ్ట్ టీమ్స్ అనేది మైక్రోసాఫ్ట్ 365తో అనుసంధానించబడిన సహకార ప్లాట్‌ఫారమ్. ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తోంది.వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయోజనాల కోసం ఇది సురక్షితమైన యాప్ అని చెప్పుకోవాలి.