విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లో హర్మన్‌‌‌‌‌‌‌‌

దుబాయ్‌‌‌‌‌‌‌‌ : విమెన్స్  టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో  ఇండియా నిరాశపరిచినప్పటికీ ఐసీసీ ప్రకటించిన టీమ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ద టోర్నమెంట్ కెప్టెన్ హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌కౌర్‌‌‌‌‌‌‌‌ చోటు దక్కించుకుంది. మెగా టోర్నీలో  రాణించిన ప్లేయర్లతో ఐసీసీ ఈ టీమ్‌‌‌‌‌‌‌‌ను సోమవారం ప్రకటించింది. సౌతాఫ్రికా ప్లేయర్‌‌‌‌‌‌‌‌ వోల్‌‌‌‌‌‌‌‌వర్ట్‌‌‌‌‌‌‌‌కు కెప్టెన్సీ ఇచ్చింది. టోర్నీలో ఇండియా గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టినా బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా హర్మన్‌‌‌‌‌‌‌‌ రాణించింది.  కప్పు నెగ్గిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ నుంచి అమెలియా కెర్‌‌‌‌‌‌‌‌, రోస్‌‌‌‌‌‌‌‌మేరీ, ఎడ్సన్‌‌‌‌‌‌‌‌ కార్సన్‌‌‌‌‌‌‌‌ జట్టుకు ఎంపికయ్యారు. 

విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ : లారా వోల్‌‌‌‌‌‌‌‌వర్ట్ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), తంజిమ్ బ్రిట్స్‌‌‌‌‌‌‌‌, డానీ వ్యాట్‌‌‌‌‌‌‌‌, అమెలియా కెర్‌‌‌‌‌‌‌‌, హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌కౌర్‌‌‌‌‌‌‌‌, దియోంద్ర దాటిన్‌‌‌‌‌‌‌‌, నిగర్‌‌‌‌‌‌‌‌ సుల్తానా, అఫీ ఫ్లెచర్‌‌‌‌‌‌‌‌, రోస్‌‌‌‌‌‌‌‌మేరీ మైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంలబా, మేగన్‌‌‌‌‌‌‌‌ షట్‌‌‌‌‌‌‌‌, ఎడెన్‌‌‌‌‌‌‌‌ కార్సన్‌‌‌‌‌‌‌‌ (12వ ప్లేయర్).