హ్యాపీ బర్త్ డే స్మార్ట్ ఫోన్ : 30 ఏళ్లు పూర్తి చేసుకున్న స్మార్ట్ విప్లవం

స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు నిత్యావసరం.. రోజులో తిన్నా తినకపోయినా చేతిలో ఫోన్ లేకపోతే మాత్రం నిద్రపట్టని రోజులు.. నిద్ర లేవగానే దేవుడు ఫొటో చూసే రోజుల నుంచి నిద్ర లేవగానే స్మార్ట్ ఫోన్ చూసే రోజులు వచ్చేశాయి.. స్మార్ట్ ఫోన్ జీవితంలో భాగం అయిపోయింది.. అలాంటి స్మార్ట్ ఫోన్ పుట్టి ఎన్నేళ్లు అయ్యిందో తెలుసా.. అక్షరాల 30 ఏళ్లు.. అవును.. 1994 ఆగస్ట్ 16వ తేదీ మొదటి స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదల అయ్యింది. 

1994, ఆగస్ట్ 16వ తేదీ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. 1992లోనే స్మార్ట్ ఫోన్ విడుదల చేద్దామని ప్రయత్నించారు. కొన్ని ఫీచర్లు యాడ్ చేసి పూర్తి స్థాయి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది ఐబీఎం కంపెనీ. IBM సిమన్ పేరుతో వచ్చిన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ను అమెరికాలోని లాస్ వెగాస్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించింది ఐబీఎం కంపెనీ. అప్పటి వరకు స్మార్ట్ ఫోన్ అంటేనే తెలియని వారికి.. ఐబీఎం తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఒక అద్భుతమైన గాడ్జెట్ గా నిలిచింది. అప్పట్లోనే టచ్ స్క్రీన్ తో స్లయిలిష్ గా ఉండేది. 4.7 ఇంచుల డిస్ ప్లేతో ఈ స్మార్ట్ ఫోన్ రూపొందించారు. అప్పట్లో స్మార్ట్ ఫోన్ అయితే ఉండేది కానీ.. అందులో ఇప్పుడు ఉన్నన్ని యాప్స్ అయితే ఉండేవి కాదు. 

ఫస్ట్ స్మార్ట్ ఫోన్ లో కేవలం క్యాలెండర్, ఆర్గనైజర్, మెసేజింగ్, కాల్స్ వరకు మాత్రమే ఉన్నాయి. ఐబీఎం సిమన్ పేరుతో వచ్చిన ఫస్ట్ స్మార్ట్ ఫోన్లు.. అప్పట్లోనే 50 వేల వరకు అమ్ముడుపోయాయి. 1992లోనే విడుదల తేదీని ప్రకటించినా.. రెండేళ్ల తర్వాత 1994 ఆగస్ట్ 16వ తేదీ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదల అయ్యింది. సో.. ఫస్ట్ స్మార్ట్ ఫోన్ కు హ్యాపీ బర్త్ డే చెబుదామా..