అంత డబ్బు ఎప్పుడూ చూడలే

వాషింగ్టన్: రూప్‌‌పూర్ న్యూక్లియర్ పవర్​ ప్రాజెక్ట్‌‌ను తాత్కాలిక ప్రభుత్వం అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని సాజిబ్ వాజెద్​ విమర్శించారు. ఇది తమ కుటుంబంపై రాజకీయంగా కక్షసాధించే చర్య అని ఆరోపించారు. ‘‘అవన్ని బూటకపు ఆరోపణలు, దుష్ప్రచారం. నా కుటుంబం లేదా నేను ఎప్పుడూ.. ఏ ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచి డబ్బు తీసుకోలేదు. 10 బిలియన్ల ప్రాజెక్ట్ నుంచి 5 బిలియన్ల ఎలా తీసుకోగలరు. మాకు ఆఫ్‌‌షోర్ ఖాతాలు లేవు. నేను 30 ఏండ్లుగా అమెరికాలో ఉంటున్న. మా బంధువులు ఇగ్లాండ్​లో నివసిస్తున్నారు. మాలో ఎవరూ అంత డబ్బును ఇంత వరకు చూడలేదు” అని అన్నారు.