మహమ్మారిగా : దేశంలో హైపర్ టెన్షన్ పేషెంట్లు 20 కోట్లు

రక్తపోటు..ఇప్పుడు తరుచుగా వింటున్న మాట..డాక్టర్ల దగ్గరకు వెళితే మొదటగా అడిగే ప్రశ్న మీకు బీపీ ఉందా అని..  రక్తపోటు గురించి ICMR  తమ అధ్యయనాల్లో ఆసక్తికర విషయాలను బయటపెట్టాయి. భారతదేశంలో దాదాపు 20 కోట్ల మంది బీపీ ( హైపర్​ టెన్షన్​)తో బాధపడుతున్నారని  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకటించింది. 

కోట్లాదిమంది భారతీయులు బీపీతో బాధపడుతున్నారు. బీపీతో బాధపడేవారు రెగ్యులర్​ వ్యాయామం, రోజుకు 8 గంటలు నిద్ర, టెన్షన్​ లేకుండా ఉంటే ...బీపీని అదుపులోకి ఉంచుకోవచ్చని ICMR తెలిపింది. 

 ICMR నివేదిక ప్రకారం కేవలం రెండు కోట్లమందికి మాత్రమే బీపీ కంట్రోల్​ లో  ఉదని ట్విట్టర్​ లో తెలిపింది. నెలకొకసారి బీపీని చెక్​ చేయించుకోవాలని తెలిపింది. తక్కువు ఉప్పు తినడం... ప్రతిరోజు అరగంట నడవటంలన కంట్రోల్​ చేయవచ్చని వైద్యనిపుణలు చెబుతున్నారు. కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తింటే సోమరితనం..అధిక నిద్ర వలన రక్తపోటు ( బీపీ) స్థాయిలు పెరుగుతాయి.  ఇంకా షుగర్​.. మెటబాలిక్ సిండ్రోమ్ ఈ రెండూ కూడా బీపీని పెంచుతాయి.  కొంతమందికి జన్య పరంగా.. హార్మోన్ల లోపంతో .. వంశపారపర్యంగా బీపీ వచ్చే అవకాశం ఉంది. 

వృద్దాప్య దశలో సహజంగా రక్తపోటు పెరుగుతుంది. ఇది పరిమితి మించితే ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.  ICMR తెలిపిన వివరాల ప్రకారం ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించి... స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ ,  పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధులతో పాటు  అధిక రక్తపోటు ప్రధాన కారణంగా మారుతుందని ప్రకటించింది. ఉప్పు సైలంట్​ కిల్లర్​ గా మారుతుందని అనేక అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం చాలామంది ఉప్పును ఎక్కువుగా తినడం వలన చిన్న వయస్సులో హైపర్​ టెన్షన్​ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, శుద్ధి చేసిన నూనెలు ... నిత్యం తినే ఆహారం.. కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

రక్తపోటును (బీపీ) ఎలా నివారించాలంటే..

  • తక్కువ ఉప్పు ఆహారాన్ని అనుసరించండి.
  • పొటాషియం  ఎక్కువుగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. 
  • రెగ్యులర్ వ్యాయామం, మంచి నిద్ర, ఒత్తిడి లేని జీవనం...  మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటే  బీపీని నియంత్రించవచ్చు. 
  • స్మోకింగ్​,.. ఆల్కహాల్​ తీసుకోవడం వంటివి చేయకూడదు. 
  • పాఠశాలలు .. వర్కింగ్​ ప్లేసెస్​ లో  ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను హైలైట్ చేయాలి.
  • గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు పెంచడం
  •  రక్తపోటును క్రమం తప్పకుండా టెస్టు చేయించుకోవడం
  • బీపీ టాబ్లెట్లు క్రమం తప్పకుండా వాడటం