ఏసీలో పని చేస్తున్నారా.. మీ కళ్లు డ్రై అవుతున్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఈ రోజుల్లో చాలామంది రోజులో ఎక్కువ సమయాన్ని ఏసీల కింద గడపాల్సి వస్తుంది. చాలా మంది ఉద్యోగులు ఆఫీసుల్లో, ఇండ్లలో ఏసీల కింద కూర్చొని పనిచేస్తుంటారు. ఎయిర్ కండిషనింగ్ సౌకర్యంగా ఉన్నా..తరుచుగా కళ్లు పొడిబారే సమస్యను ఎదుర్కొంటుంటారు. పొడిబారిన కళ్లు, దురద, మంట, ఎరుపు, కాంతిని తట్టుకోలేకపోవడం వంటి కంటి సమస్యలతో అసౌకర్యంగా ఉంటుంది. ఇవి మన ఏకాగ్రతను కోల్పోయేలా చేస్తుంది. ఇది పనిపై ప్రభావం చూపే అవకాశం ఉటుంది. అయితే ఎయిర్ కండిసన్ కింద పనిచేసేటపుడు కళ్లు పొడిబారకుండా నిరోధించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి అవేంటో చూద్దాం.

హైడ్రేటెడ్ గా ఉండటం

కళ్లు పొడిబారకుండా ఉండాలంటే అతి ముఖ్యమైనది  ఆర్థ్రీకరణ. అంటే మన శరీరాన్ని , కళ్లను హైడ్రేటెడ్ గా ఉంచడం. రోజంతా  మీరు పుష్కలంగా  నీరు తాగితే ఈ హైడ్రేటెడ్ గా ఉండవచ్చు. కెఫిన్, ఆల్కాహాలిక్ వంటివి ఎక్కువగా వినియోగించకూడదు.ఇవి శరీరం నుంచి నీటిని త్వరగా ఖాలీ అయ్యేలా చేస్తాయి. ఎప్పుడూ వాటర్ అందుబాటులో ఉంచుకొని ఒకేసారి అధికంగా నీటి ని తాగకుండా కొంచెంకొంచెంగా ఎక్కవ సార్లు తాగుతూ ఉండాలి. 

క్రమం తప్పకుండా కంటిరెప్పులు కొడుతూ ఉండాలి. 

బ్లింక్ చేయడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ.. ఇది కంటి ఉపరితలంపై తేమను వ్యాప్తం చేస్తుంది. స్క్రీన్ లేదా ఏదైనా వస్తువుపై ప్రత్యేక దృష్టి పెట్టి పని చేస్తున్నప్పుడు కంటి రెప్పలను కొట్టకుండా ఆపుతుంటాం.. ఇలాంటి సందర్భాల్లో కళ్లు పొడిబారి అసౌకర్యానికి గురి చేస్తాయి. ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల చొప్పున విరామం తీసుకోవాలి. ఇది కంటి కండరాలను, రెప్పలను ఆడించేందుకు హెల్ప్ చేస్తుంది. 

హ్యూమిడి ఫైయర్ ఉపయోగించాలి 

ఎయిర్ కండిషన్ ఉపయోగిస్తున్న పరిసరాలు తక్కువ తేమను కలిగి ఉంటాయి. ఇది పొడి కళ్లకు దారి తీస్తుంది. మీ వర్క్ ప్లేస్ లో హ్యూమడి ఫైయర్ ను ఉంచడం వల్ల గాలికి తేమను తిరిగి అందిస్తుంది. మీ కళ్లు పొడిబారకుండా ఉంటాయి. ఇందుకోసం ఏసీలో ఇండోర్ తేమ స్థాయిని 30శాతం నుంచి 50 శాతం మధ్య ఉంచాలి.

స్క్రీన్ సర్దుబాటు 

స్క్రీన్ సర్దుబాటు సరిగా లేకుంటే కంటిపై ఒత్తడి పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి మీ కంప్యూటర్ స్క్రీన్ ను కంటి స్థాయికి కొద్దిగా కిందకు , మీ కళ్లకు దాదాపు చేయి పొడవు దూరంలో ఉంచుకోవాలి. స్క్రీన్ బ్రైట్ నెస్, కాంట్రాస్ట్ సెట్టింగులను సర్దుబాటు చేసుకోవాలి. ఓవర్ హెడ్ లైటింగ్ తగ్గించడానికి యాంటీ గ్లేర్ స్క్రీన్  ఫిల్టర్లనువాడాలి. ఇవి కళ్లు పొడిబారకుండా కాపాడుతుంది. 

లూబ్రికేటింగ్ ఐడ్రాప్స్ వాడాలి

లూబ్రికేటింగ్ కంటి చుక్కులు వాడటం ద్వారా పొడికళ్లను నివారించవచ్చు. ఇవి సహజనకన్నీటి ఉత్పత్తిని భర్తీ చేయడం ద్వారా తాత్కాలిక ఉపహశనం కలిగిస్తాయి. అయితే కంటిచుక్కలపై ఎక్కువగా ఆధారపడకూడదు.