డివైడర్ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. హైద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఘటన

నల్లగొండ జిల్లా:  హైద్రాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలయ్యాయి. బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులు అంబులెన్స్కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు.