యంగ్‌‌‌‌‌‌‌‌ ఇండియాకు నైపుణ్యాల వారధి స్కిల్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ

భారత దేశానికి తెలంగాణను మార్గదర్శిలా నిలపడం అంటే ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ మార్వెల్స్‌‌‌‌‌‌‌‌ (కళ్లు చెదిరిపోయే నిర్మాణాల)తో కాదు! మానవ వనరులను, ముఖ్యంగా యువతను ఉత్తమంగా, ఉన్నతంగా తీర్చిదిద్దడంతోనే అది సాధ్యమవుతుంది. యువతలోని శక్తి, సామర్థ్యాలకు మెరుగులు దిద్ది అద్భుతమైన నైపుణ్యాలు ఉన్న మానవ వనరులుగా తీర్చిదిద్దడం కోసమే తెలంగాణ ప్రభుత్వం ‘యంగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా స్కిల్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ’ తరగతులను నవంబర్‌‌‌‌‌‌‌‌ నాలుగో తేదీన ప్రారంభించబోతున్నది. 

‘ఇనుప కండరాలు.. ఉక్కు నరాలు.. వజ్ర సంకల్పం ఉన్న వంద మంది యువకులను తనకిస్తే దేశం రూపురేఖలు మార్చేస్తాను’ అన్నారు స్వామి వివేకానంద. ఆ మహనీయుని వాక్కును మనసా.. వాచా.. కర్మనా అనుసరిస్తోంది సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం. దేశంలో పుష్కలంగా ఉన్న యువశక్తికి మెరుగులు దిద్దితే ప్రపంచ దేశాల్లో మన భారతావని అగ్రరాజ్యంగా నిలబడటం అసాధ్యమేం కాదు. యువతను మెరికల్లా తీర్చిదిద్దడానికి.. వారిలోని  ప్రతిభకు సాన బెట్టడానికి, నైపుణ్యవంతమైన శక్తిగా తీర్చిదిద్దడానికి ఇప్పటివరకు  ప్రయత్నలోపం స్పష్టంగా కనిపిస్తున్నది. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పేర్లతో స్కిల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సెంటర్లు నిర్వహించాయి.. నిర్వహిస్తూనే ఉన్నాయి. యువతలో దాగి ఉన్న ప్రతిభ, శక్తి సామర్థ్యాలను నూటికి నూరుపాళ్లు వెలికి తీయడానికి అవి దోహద పడలేదనే చెప్పాలి. స్కిల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్​లో శిక్షణ ఇచ్చామా.. ప్లేస్​మెంట్‌‌‌‌‌‌‌‌ ఇప్పించామా అనే వరకే అవి పరిమితం అయ్యాయి.  స్కిల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్​లో జాయిన్‌‌‌‌‌‌‌‌ అవుతున్నవారిలో సగంమంది వరకే  ప్లేస్‌‌‌‌‌‌‌‌ మెంట్స్‌‌‌‌‌‌‌‌ వస్తున్నాయి. వారిలో 60 శాతానికి పైగా అరకొర వేతనాలతో జీవితాలను నెట్టుకురాలేక.. వాళ్లు కల్పించిన పని చేయలేక అర్ధంతరంగా ఇండ్లకు తిరిగి వెళ్లిపోతున్నారు. ఫలితంగానే స్కిల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయింది. నిరుద్యోగం అలాగే కొనసాగుతోంది.

ప్రతిభకు నైపుణ్యం తోడు కావాలి

రాష్ట్రంలోని యూనివర్సిటీల నుంచి ఏటా సాధారణ డిగ్రీలు, పీజీలతో పాటు ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌, మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, ఫార్మా, ఇతర సైన్స్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌ డిగ్రీ, పీజీ పట్టాలు చేతబట్టుకొని బయటకు వస్తున్న లక్షలాది యువతను సరైన దిశలో నడిపించాలన్నా.. వారి చదువుకు తగ్గ ఉద్యోగం దక్కాలన్నా వారిలో ఆయా ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్‌‌‌‌‌‌‌‌ ముఖ్యం. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌, ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌ డిగ్రీలు, పీజీలు చేసినవారిలోని ప్రతిభకు నైపుణ్యం కూడా తోడైతే ప్రపంచ శ్రేణి కంపెనీలు వారిని కళ్లకు అద్దుకొని ఉద్యోగాలు కల్పిస్తాయి. లక్షల రూపాయల ప్యాకేజీలు ఇస్తాయి. వాళ్లు సంపాదించే ప్రతి రూపాయి తెలంగాణ ప్రగతికి, దేశాభివృద్ధికి బాటలు వేస్తోంది. ఈ యజ్ఞానికే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఉపక్రమించింది. పబ్లిక్‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ (పీపీపీ)లో ఈ వర్సిటీని స్థాపించబోతున్నది. ప్రపంచంలోనే అగ్రశ్రేణి సంస్థలు స్కిల్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీతో కలిసి పని చేయనున్నాయి. దేశంలోని పారిశ్రామిక దిగ్గజాల్లో ఒక్కరైన ఆనంద్‌‌‌‌‌‌‌‌ మహీంద్రాను స్కిల్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీకి చాన్స్​లర్‌‌‌‌‌‌‌‌ గా నియమించడంతో దేశంలోని ప్రఖ్యాత సంస్థలు తెలంగాణ వైపు చూస్తున్నాయి.

ప్రపంచంతో పోటీపడే స్కిల్స్​

యంగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా స్కిల్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీని ఏ ఒక్కరి గుత్తాధిపత్యంలో పెట్టకుండా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కంపెనీలతో కూడిన బోర్డుకు అప్పగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి స్కిల్స్ ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయో గుర్తించి వాటికి అనుగుణంగా స్కిల్ యూనివర్సిటీలో కోర్సులను ప్రవేశ పెట్టనున్నారు. గ్లోబలైజేషన్ తర్వాత ఉద్యోగాల పరిధి ప్రపంచవ్యాప్తం అయ్యింది. ఈ పోటీని తట్టుకొని మన యువత ఉద్యోగాలు సాధించేలా స్కిల్యూనివర్సిటీ సాన పెట్టనుంది. హైటెక్‌‌‌‌‌‌‌‌ సిటీలోని నేషనల్‌‌‌‌‌‌‌‌ అకాడమీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ కన్‌‌‌‌‌‌‌‌ స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌ (న్యాక్‌‌‌‌‌‌‌‌)తో పాటు, గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ కాలేజీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా (ఇస్కీ)లో స్కిల్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీని తాత్కాలికంగా  ప్రారంభిస్తున్నారు. 

20 స్కిల్​ డెవలప్​మెంట్​ కోర్సులు

ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ సిటీలో (రంగారెడ్డి జిల్లా మీర్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌ పేటలో) యూనివర్సిటీ కోసం ప్రభుత్వం 57 ఎకరాల భూమి ఇవ్వడంతో పాటు భవన నిర్మాణాలకు రూ.100 కోట్లు కేటాయించింది. మేఘా ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ ఇన్​ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ రూ.200 కోట్లు, అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌ రూ.100 కోట్ల విరాళాన్ని యంగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా స్కిల్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ నిర్మాణం, వసతుల కల్పన కోసం అందజేశాయి. స్కిల్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ మొదటి ఏడాది తరగతులు హైటెక్‌‌‌‌‌‌‌‌ సిటీలో న్యాక్‌‌‌‌‌‌‌‌, గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ కాలేజీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా (ఇస్కీ) భవనాల్లో ప్రారంభించనున్నారు.  హెల్త్ కేర్, ఈ - కామర్స్ అండ్ లాజిస్టిక్స్ విభాగాల్లో డిప్లొమా, సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ కోర్సులను మొదట ప్రారంభించనున్నారు. ఈ కోర్సుల నిర్వహణకు అపోలోతో పాటు ఏఐజీ, లెన్స్ కార్ట్, ఫ్లిఫ్ కార్ట్, అమెజాన్, అల్కార్గో, ప్రొ కనెక్ట్, ఓ9 సొల్యూషన్స్ కంపెనీలతో ఎంవోయూ చేసుకున్నారు. ఈ కోర్సుల్లో రెండు వేల మందికి స్కిల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్​లో ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వనున్నారు. వీటితోపాటు మరో నాలుగు కోర్సులను ఈ ఏడాది ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. క్రమేణా 20 స్కిల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోర్సులను వర్సిటీలో ప్రారంభించనున్నారు.

అగ్రశ్రేణి కంపెనీల్లో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి

 స్కిల్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీతో కలిసి పని చేయడానికి 140 కంపెనీలు ముందుకొచ్చాయి. దేశంలోనే ప్రఖ్యాత విద్యాలయాలైన ఐఐటీలు, ఐఐఎంలు, ఐఎస్‌‌‌‌‌‌‌‌బీల స్థాయిలో స్కిల్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీని నిలబెట్టాలనే చిత్తశుద్ధితో  తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీల్లో తెలంగాణ బిడ్డలకు ఎక్కువ ఉద్యోగాలు దక్కే మహత్కార్యానికి ప్రభుత్వం ఇయ్యాల అంకురార్పణ చేయనుంది.

- డా. వి.
నరేందర్ రెడ్డి, 
 విద్యావేత్త