హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైడ్రా అవసరం : కొరివి వేణుగోపాల్

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టౌన్,వెలుగు :  హైదరాబాద్ సిటీలో కబ్జాల చెరవీడాలంటే హైడ్రా ఎంతో అవసరమని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ స్టేట్ చీఫ్​ కొరివి వేణుగోపాల్ అన్నారు. మంగళవారం స్థానిక  ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ దేశంలోని మహానగరాల్లో ఒకటైన  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వరదలు, డ్రైనేజీగా మారిన మూసీనది సమస్యలు ఉన్నాయన్నారు. 

ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం  హైడ్రా, మూసీ రివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందన్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చుట్టుపక్కల 4వేల చెరువులు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉండగా.. 75శాతం కనుమరుగయ్యాయన్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరదలు, మూసీ ప్రక్షాళనకు ప్రతిపక్షాలు సహకరించాలని సూచించారు.