వామ్మో.. అరవై ఏళ్ల వృద్దుడి కిడ్నీలో 418 రాళ్లు


హైదరాబాద్ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ(AINU) డాక్టర్లు చేసిన ఓ ఆపరేషన్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అరవై ఏళ్ల ఓ వృద్దుడికి కిడ్నిలో  స్టోన్స్ తొలగించే శస్త్ర చికిత్స చేశారు. ఈ ఆపరేషన్ లో డాక్టర్లు రోగి మూత్రపిండాల నుంచి 418 రాళ్లను బయటకు తీశారు. పూర్తిగా చెడిపోయి 27శాతం మాత్రమే కిడ్నీ పనిచేస్తున్న పరిస్థితిలో పేషెంట్ హాస్పిటల్ లో చేరాడు. అతనికి పెర్క్యుటేనియస్ నెఫ్రోలిథోటోమీ (పిసిఎన్‌ఎల్) ఆపరేషన్ చేసి నయం చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా చిన్న  కోతతో పూర్తిగా కిడ్నీలోని రాళ్లను తొలగించవచ్చని వైద్యుల బృందం తెలిపింది. వృద్ధుడు సంప్రదించగా  పరీక్షలు చేసి, కిడ్నీలో చిన్న చిన్న రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. పెద్ద సర్జరీ అవసరం లేకుండా PCNL టెక్నిక్ ఆపరేషన్ విధానంలో 2 గంటలు శ్రమించి ఈ రాళ్లు మొత్తాన్ని తొలగించారు.