హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో 100 పోస్టులకు నోటిఫికేషన్..

 

Hyderabad BHEL Trade Apprentice : హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో 100 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రామచంద్రపురం భెల్ లో అప్రెంటిస్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సెప్టెంబర్ 13వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణతో పాటు నెలవారీగా స్టేఫండ్ ఇస్తారు. అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రేడ్ అప్రెంటిస్‌లుగా శిక్షణ ఇస్తారు. అభ్యర్థులు ఇప్పటికే అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొందిన వారు లేదా ఐటీఐ పూర్తి చేసి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగ అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు కాదు.

వయస్సు

  • జనరల్ అభ్యర్థులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు (01.09.2024 నాటికి), గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు ..
  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు (నాన్-క్రీమీ లేయర్), పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు(కనీసం 40% వైకల్యంతో) సడలింపు ఉంటుంది.
  • రెగ్యులర్ ఉద్యోగులపై ఆధారపడిన వారికి (పనిచేస్తున్న/రిటైర్డ్/ మరణించిన) 03 సంవత్సరాల అదనపు సడలింపు ఇస్తారు.


విద్యార్హత

  • జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ(నాన్ క్రీమీ లేయర్) అభ్యర్థులు మెట్రిక్/ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత, ఐటీఐలో కనీసం 60% మార్కులతో రెగ్యులర్ గా పూర్తి చేయాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో పాస్ అవ్వాలి.
  • నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) నుంచి ITI ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • 2021లో లేదా ఆ తర్వాత ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు  మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంపిక విధానం

అసెస్‌మెంట్ టెస్ట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా విడుదల చేస్తారు.

పోస్టుల వివరాలు

  • ఫిట్టర్ -20
  • మెషినిస్ట్- 40
  • టర్నర్- 26
  • వెల్డర్- 14
  • మొత్తం -100 పోస్టులు

దరఖాస్తు విధానం :

  • Step-1 : అభ్యర్థులు అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో నమోదు (https://www.apprenticeshipindia.gov.in/) చేసుకోవాలి.
  • Step 2 : రిజిస్ట్రేషన్ తర్వాత అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో “BHEL రామచంద్రపురం హైదరాబాద్”కి దరఖాస్తు చేసుకోండి.
  • BHEL హైదరాబాద్ వెబ్‌సైట్ https://hpep.bhel.com/ పై క్లిక్ చేయండి.
  • ‘ఎంగేజ్‌మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్ 2024-25’ లింక్‌ను ఓపెన్ చేసి 'అప్లై'పై క్లిక్ చేయండి.
  • అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్‌ను తో అకౌంట్ క్రియేట్ అవుతుంది.
  • అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీతో లాగిన్ చేయండి.
  • అవసరమైన వివరాలను పూర్తిచేయండి. అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • పూర్తి చేసిన అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోండి.
  • పుట్టిన తేదీ, అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నంబర్ తో ‘ఎడిట్’ ఆప్షన్ ఉపయోగించవచ్చు.
  • ఎడిట్ ఆప్షన్‌ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఎడిట్ చేస్తే అప్లికేషన్ మళ్లీ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
  • ‘రెగ్యులర్ ఉద్యోగులపై ఆధారపడిన-సర్వీస్/రిటైర్డ్/డిసీజ్డ్- విభాగం మినహా మిగతా అభ్యర్థులు బీహెచ్ఈఎల్, ఆర్సీపురం, హైదరాబాద్‌కి ప్రింట్ అవుట్‌ను పంపాల్సిన అవసరం లేదు.

పరీక్ష విధానం

  • అప్రెంటిస్ ఎంపిక అభ్యర్థులు సాధించిన మార్కులపై ఆధారపడి ఉంటుంది.
  • రాత పరీక్షకు(60 నిమిషాలు) ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్‌ ఛాయిస్ లో సంబంధిత ట్రేడ్ సిలబస్ నుంచి 50 ప్రశ్నలను అడుగుతారు.
  • నెగిటివ్ మార్కులు ఉండవు.

ఆధార్, ఈకేవైసీ ధృవీకరణ

అభ్యర్థులు తప్పనిసరిగా అప్రెంటిస్ పోర్టల్‌లో నమోదు చేసుకునేటప్పుడు, ఆధార్ లో వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్థారించుకోవాలి. ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, జెండర్, అభ్యర్థి పేరు, తండ్రి పేరు స్పెల్లింగ్ లు అభ్యర్థుల ఎస్ఎస్సీ సర్టిఫికేట్‌తో సరిపోల్చుకోవాలి. అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్‌లో ఆధార్ ధృవీకరణతో పాటు ఈకేవైసీ తప్పనిసరి. అభ్యర్థులు ఈకేవైసీ ధృవీకరణ కోసం బ్యాంక్ వివరాలు, IFSC కోడ్‌ను సరిగ్గా నమోదు చేయాలి.

ముఖ్యమైన తేదీలు :

  •  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది 13.09.2024 
  •  HR-రిక్రూట్‌మెంట్ విభాగానికి ఫారమ్- I సమర్పించడానికి చివరి తేదీ- 14.09.2024 (సాయంత్రం 4.30 గంటలు)
  •  తాత్కాలిక పరీక్ష తేదీ- 24.09.2024