ఎమ్మార్వో జయశ్రీ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన హుజూర్ నగర్ కోర్టు

సూర్యాపేట:హుజూర్ నగర్లో ప్రభుత్వ భూములకు పట్టా పాస్ బుక్లు జారీ చేసి, రైతుబంధు స్వాహా చేసిన కేసులో ఎమ్మార్వో జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీష్ లను హుజూర్ నగర్ కోర్టులో హాజరుపర్చారు. 15 రోజుల పోలీస్ కస్టడీ కోరుతూ పలు అభియోగాలతో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఎమ్మారో జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీష్ కు బెయిల్ ఇవ్వాలని నిందితుల తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామంలో 2019 నవంబర్ నుంచి ఫిబ్రవరి 2020 వరకు 36 ఎకరాల 23 గుంటల ప్రభుత్వ భూమిని ధరణి ఆపరేటర్ కుటుంబ సభ్యులకు, ఇతరుల పేరున ఎల్‌ఎంఆర్ పోర్టల్‌లోకి మార్పిడి చేసినట్లు ఎమ్మార్వో జయశ్రీ ఆరోపణలు ఎదుర్కొంటుంది.ఈ  విషయంలో హుజూ ర్‌నగర్ అప్పటి తహశీల్దార్ వజ్రాల జయశ్రీపై పోలీసులు విచారణ చేసి బుధవారం స్ధానిక కోర్టులో హాజరు పరిచారు. 

అరెస్ట్ చేసి 14రోజుల పాటు రిమాండ్‌కు తరలించినట్లు కోర్టు తీర్పునిచ్చింది. ఈ సంఘటనలో ఇప్పటికే ఆపరేటర్ జగదీష్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తహశీల్దార్ జయశ్రీ అనుములు మండలం తహశీల్దార్‌గా పని చేస్తుంది. జయశ్రీని రిమాండ్‌కు తరలించడంతో స్ధానిక ఉద్యోగుల్లో కొంత మందికి వణుకు మొదలైంది. ఎమ్మార్వో జయశ్రీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.