షార్ట్​ సర్క్యూట్​తో గుడిసెలు దగ్ధం

ఇందల్వాయి, వెలుగు : లోలం గ్రామంలో మంగళవారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో రెండు గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. గ్రామానికి చెందిన సున్నం సత్తెమ్మ, సున్నం భూమయ్య కుటుంబాలు గుడిసెల్లో జీవిస్తున్నారు. సోమవారం వారు మెండోరాలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం వేకువజామున షార్ట్​సర్క్యూట్​తో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

 చూస్తుండగానే గుడిసెలు కాలి బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇంట్లో రూ.1లక్ష నగదు కాలిపోయినట్లు బాధితులు పేర్కొన్నారు. మొత్తంగా రూ.6 లక్షల ఆస్తి నష్టం జరిగిందని రెవిన్యూ ఆఫీసర్లు అంచనా వేశారు.