మినీ కూలర్
ఎండాకాలం అంటేనే మండే కాలం. అందుకే కాసేపు కరెంట్ పోయి.. ఫ్యాన్, కూలర్, ఏసీల్లాంటివి పనిచేయకపోతే ఊపిరాడనంత పనైపోతుంది. ఇలాంటి వాతావరణాన్ని తట్టుకోవాలంటే ఇలాంటి పోర్టబుల్ కూలర్ ఇంట్లో ఉండాలి. దీన్ని హస్టెల్ అనే కంపెనీ తెచ్చింది. పవర్ బ్యాంక్‌కి కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. కరెంట్ ఉన్నప్పుడు మొబైల్ ఛార్జర్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. సంప్రదాయ ఫ్రీయాన్ ఎయిర్ కండిషనర్‌లతో పోలిస్తే దీంతో కనీసం 90 శాతం కరెంట్ఆదా అవుతుంది. కాకపోతే సైజులో చిన్నగా ఉండడం వల్ల గాలి ఒకరికి మాత్రమే సరిపోతుంది. ఇందులో చల్లని నీళ్లు పోసి వాడుకోవాలి. స్పీడ్ కంట్రోల్ చేయడానికి మూడు మోడ్స్ ఉంటాయి.
ధర : 998 రూపాయలు
ఫోల్డింగ్ లాప్టాప్ స్టాండ్
ల్యాప్‌టాప్‌ని ఈజీగా వాడాలన్నా, ఎండకాలంలో హీటెక్కకుండా కాపాడుకోవాలన్నా ల్యాప్‌టాప్ స్టాండ్ తప్పనిసరి. అందుకే చాలామంది స్టాండ్స్ వాడుతుంటారు. కానీ.. బయటికెళ్లినప్పుడు ల్యాప్‌టాప్‌ని తీసుకెళ్లగలం. కానీ.. స్టాండ్‌ని కూడా మోసుకెళ్లలేం. అలాంటప్పుడే ఈ పోర్టబుల్ మినీ స్టాండ్ వాడితే సరిపోతుంది. ఈ ఫోల్డింగ్ పోర్టబుల్ స్టాండ్‌ని బీకేఎన్ అనే కంపెనీ అమెజాన్ వెబ్సైట్లో అమ్ముతోంది. ఈ ప్యాక్‌లో రెండు చిన్న సైజు స్టాండ్స్ వస్తాయి. వాటికి ఉండే స్టిక్కర్ సాయంతో ల్యాప్‌టాప్ వెనక అతికిస్తే చాలు. దీన్ని రెండు యాంగిల్స్‌లో అడ్జెస్ట్ చేసుకోవచ్చు. వీటిని ప్రీమియం జింక్ అల్లాయ్ మెటీరియల్‌తో తయారుచేశారు. కాబట్టి ల్యాప్‌టాప్ బరువును ఈజీగా మోస్తాయి. అన్ని సైజుల ల్యాప్‌టాప్‌లకు ఇవి సరిపోతాయి. ఈ స్టాండ్‌ని మడతపెట్టినప్పుడు 7 మి.మీ. (0.28 అంగుళాలు) మాత్రమే ఉంటుంది. కాబట్టి ల్యాప్‌టాప్‌ని బ్యాగ్‌లో పెట్టినా, పెద్ద స్టాండ్ మీద పెట్టుకున్నా ఏ ఇబ్బంది ఉండదు.
ధర: 449 రూపాయలు
ఓవర్ ఫ్లో అలారం
ఇండిపెండెంట్ ఇళ్లలో చాలాసార్లు వాటర్ మోటర్ ఆన్ చేసి.. పనిలోపడి మర్చిపోతుంటారు. కట్ చేస్తే.. బిల్డింగ్ మీద పెట్టిన వడియాలు, అప్పడాలు, ఎండబెట్టిన మిరపకాయలు నీళ్లలో ఈత కొడుతుంటాయి. అందుకే వాటర్ ట్యాంక్ ఓవర్‌ఫ్లో అలారం పెట్టుకోవాలి. దీన్ని స్వర్ణ్ జల్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తెచ్చింది. ఇది మాగ్నెటికల్లీ ఐసోలేటెడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. కాబట్టి షాక్ ప్రూఫ్‌తో వస్తుంది. వాటర్ పంప్‌కి ఇచ్చిన సప్లై నుంచే దీనికి కూడా పవర్ సప్లై ఇవ్వాలి. సెపరేట్‌గా ఇస్తే పంప్ ఆన్ చేసిన ప్రతిసారి దీన్ని కూడా ఆన్ చేయాలి. ఈ డివైజ్‌కు కనెక్ట్ చేసిన రెండు సెన్సర్లను ట్యాంక్ లోపల పై భాగంలో ఉంచాలి. నీళ్లు ఈ సెన్సర్లను తాకగానే అలారం మోగుతుంది. సెన్సర్లనుహై క్వాలిటీ బ్రాస్‌తో తయారుచేశారు. నికెల్ పూత కూడా పూసారు. డివైజ్ నుంచి వెయ్యి మీటర్ల దూరంలో వీటిని ఉంచి వైర్‌తో కనెక్ట్ చేసినా పనిచేస్తుంది. వీటికి కనెక్ట్ చేయడానికి ఈ డివైజ్‌తో పాటు 20 మీటర్ల వైర్ వస్తుంది. ఇన్‌స్టాల్ చేయడం చాలా ఈజీ.
ధర : 495 రూపాయలు
సౌండ్ అబ్జార్బర్
కొన్ని కార్ల డోర్లు, బ్యానెట్‌లు మూసినప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విన్నప్పుడల్లా చిరాకుపుడుతుంది. అలాంటి పాత కార్లకు ఇలాంటి షాక్ అబ్జార్బర్లు పెట్టుకోవాలి. వీటిని డోర్ ఫ్రేమ్, బ్యానెట్, ట్రంక్ కాంటాక్ట్ పాయింట్ల దగ్గర అతికించాలి. ఇవి కొల్లిషన్ ఫ్రిక్షన్‌ని తగ్గిస్తాయి. ఈ కార్ డోర్ షాక్ అబ్జార్బర్లను గోజాక్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తెచ్చింది. ఇవి కార్లకే కాదు.. అన్ని రకాల వెహికల్ డోర్లకు వాడొచ్చు. వీటిని హై క్వాలిటీ పీవీసీ మెటీరియల్‌తో తయారుచేశారు కాబట్టి ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయి. వీటిని పేస్ట్ చేయాల్సిన ప్లేస్‌ని బాగా శుభ్రం చేయాలి. తర్వాత దీనికి ఉండే స్టిక్కర్‌తీసి, అతికించాలి. ఈ అబ్జార్బర్ 2.5 సెం.మీ. వ్యాసం, 0.8 సెం.మీ. మందంతో వస్తాయి.
ధర : 274 రూపాయలకు 12 అబ్జార్బర్లు