ఎల్లమ్మ తల్లి దేవాలయంలో మంత్రి పొన్నం ప్రతిఙ్ఞ

దసరా పండుగ సందర్భంగా పలు దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. వీఐపీలు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్​దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు,  ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు డ్రైవ్​ చేయమని.. ట్రాఫిక రూల్స్​ పాటించాలని ఎల్లమ్మ తల్లి దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్​.. స్థానిక ప్రజా ప్రతినిథులు ప్రతిఙ్ఞ చేశారు. 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు.  ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ విజయదశమి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.  సామాజిక, రాజకీయ,ఆర్థిక సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 18 విడుదల చేసిందని తెలినారు.  దేశానికే రోల్​ మోడల్​ గా ఉండేలా .. ఈ సర్వే  90 రోజుల పాటు ఈ కొనసాగుతుందని  తెలిపారు. బీసీ కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని .. దీనికి అందరూ సహకరించాలని కోరారు.