అంజన్న ఇరుముడి ఆదాయం రూ.2.89లక్షలు

కొండగట్టు,వెలుగు :  జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో గత నెల 30 నుంచి ఈ నెల 2 వరకు మూడు రోజులపాటు పెద్ద జయంతి ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాల సందర్భంగా దీక్షాపరులు కట్టిన ఇరుముడులను గురువారం

ఆలయ అధికారులు విప్పి లెక్కించారు. రూ.2,89,810 ఆదాయం వచ్చినట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ అంజయ్య, సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్ శర్మ, సునీల్, చందు, తదితరులు పాల్గొన్నారు.