రాజన్న హుండీ ఆదాయం..రూ. కోటి28 లక్షలు

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న హుండీ ఆదాయం రూ. కోటి 28 లక్షలు వచ్చినట్టు ఆలయ ఈవో వినోద్​రెడ్డి తెలిపారు. 7 రోజుల  హుండీ ఆదాయాన్ని మంగళవారం(జవనరి 7, 2025) ఆలయ ఓపెన్​ స్లాబ్​లో  పోలీసుల భద్రత నడుమ అధికారులు, సిబ్బంది లెక్కించారు. 

రూ. కోటి 28 లక్షల 78 వేల 106 నగదు, 305 గ్రాముల బంగారం, 8.200 కిలోల వెండి భక్తులు సమర్పించినట్టు ఈవో పేర్కొన్నారు. ఏసీ ఆఫీసు పరిశీలకులు సత్యనా రాయణ, ఏఈఓలు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, శివ రామకృష్ణ భజన మండలి సభ్యులు ఉన్నారు.