మగతనం ఉంది కానీ.. పిల్లలే పుట్టటం లేదు : మగాళ్లలో 61 శాతం తగ్గిన స్పెర్మ్ కౌంట్

మగాళ్లు.. మెగుళ్లు అవుతున్నారు కానీ తండ్రులు మాత్రం కావటం లేదంట.. ఈ సమస్య ఇండియాలోనే కాదు.. 53 దేశాల్లో ఉందంట.. అవును మగాళ్లలో మగతనం అయితే ఉంది.. తండ్రి అయ్యే సామర్థ్యం రోజురోజుకు తగ్గిపోతుందంట.. 1973 నుంచి 2018 మధ్య కాలంలో 223 పత్రికలు, మ్యాగజైన్స్ లో వచ్చిన కథనాల ఆధారంగా హ్యూమన్ రీ ప్రొడెక్షన్ సంస్థ నిర్వహించే సర్వేలో వెల్లడైంది. 

పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత ఏకంగా 51.6 శాతానికి పడిపోయింది. అదే విధంగా స్పెర్మ్ కౌంట్ 62.3 శాతానికి తగ్గింది. 1973 కంటే ముందుతో పోల్చుతుంటే.. ఇది క్రమంగా తగ్గుతూ.. 2018 నాటికి ఈ పరిస్థితికి వచ్చిందనేది ఈ సర్వే సారాంశం. 

Also Read: హ్యాండ్ శానిటైజర్ వాడుతున్నారా.. అయితే మీ బ్రెయిన్ దెబ్బతింటుంది..!

మగాళ్లలో స్పెర్మ్ కౌంట్ తగ్గటానికి.. స్పెర్మ్ నాణ్యత 50 శాతం కంటే ఎక్కువగా పడిపోవటానికి కారణం మారిన జీవన శైలి అంటున్నారు. తీసుకునే ఆహారంలో బలం లేకపోవటం ఒకటి అయితే.. ఒత్తిడి, టెన్షన్ అనేది ప్రధాన కారణంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. 

53 దేశాల్లో 57 వేల మంది మగాళ్లలో స్పెర్మ్ నమూనాలు సేకరించి మరీ ఈ విషయాన్ని వెల్లడించింది ఆ సంస్థ. మగాళ్లలో సంతానోత్పత్తి సామర్ధ్యం గణనీయంగా పడిపోతుందని.. రాబోయే సంవత్సరాల్లో ఇది మరింత తీవ్రంగా కానుందని హెచ్చరించింది. మగాళ్లు మెగుళ్లు అవుతున్నారు కానీ.. తండ్రులు కాలేకపోతున్నారని.. దీనికి కారణం స్పెర్మ్ కౌంట్ 62.3 శాతానికి తగ్గటం.. అదే సమయంలో స్పెర్మ్ నాణ్యత 51.6 శాతానికి పడిపోవటమే కారణం. 

అందుకే ఇప్పుడు IVF వంటి అనేక విధానాలు పుట్టుకొస్తున్నాయని.. రాబోయే రోజుల్లో మగాళ్లలో సంతానోత్పత్తి సామర్ధ్యం పెరగకపోతే.. పిల్లల పుట్టుకపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది హ్యూమన్ రీప్రొడక్షన్ అప్ డేట్ జర్నల్..