మానవ హక్కుల నేత గొర్రెపాటి మాధవరావు కన్నుమూత

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన మానవ హక్కుల నేత, ప్రముఖ అడ్వకేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొర్రెపాటి మాధవరావు (77) శనివారం కన్నుమూశారు. ఉదయం ఇంట్లో ఉన్న టైంలో గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించగా ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ చనిపోయారు. ఆయనకు భార్య మీనా సహానీ, కూతుళ్లు మానస, ఆధిత్య మధుమిథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు. కోటగిరి మండలంలో పాఠశాల విద్య పూర్తి చేసిన గొర్రెపాటి బాన్సువాడలో ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లా చదివారు. పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ, సీపీఐఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేసిన ఆయన తర్వాత బాలగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి మానవ హక్కుల ఉద్యమం వైపు నడిచి, ఆ సంఘం జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.

 ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కౌంటర్లలో మావోయిస్టులు చనిపోయిన సందర్భాల్లో పోలీసులు, గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేసులు వేసి వాదించేవారు. గొర్రెపాటి సీపీఐఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలోని విమోచన పక్ష పత్రిక, స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాసపత్రిక విజృంభనకు ఎడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. కార్మిక చట్టాలు, చైనా విప్లవం, హ్యూమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జాతీయవాదంపై పలు పుస్తకాలు రాశారు. గొర్రెపాటి మరణ వార్త తెలుసుకున్న జడ్జీలు పి.శ్రీనివాసరావు, ఆశాలత, బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జగన్మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అడ్వకేట్లు ఆయన డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీ వద్ద నివాళి అర్పించారు. ఆయన కండ్లను లయన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డొనేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. గొర్రెపాటి డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీని ఆదివారం మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీకి అందజేయనున్నారు.