భక్తులతో కిక్కిరిసిన వేములవాడ.. దర్శనానికి 5 గంటలు

వేములవాడ, వెలుగు:  వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం సోమవారం శివనామస్మరణతో మార్మోగింది. స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో స్వామి వారి దర్శనానికి ఐదు గంటలు పట్టిందని భక్తులు తెలిపారు. 

మరికొందరు కోడెమొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఆఫీసర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరో వైపు ఆలయ స్థానాచార్యులు అప్పల భీమశంకర్‌‌‌‌‌‌‌‌ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. బాలాత్రిపురదేవీ అమ్మవారికి కుంకుమ పూజ జరిపారు.