కోడెమొక్కుకు ఐదు గంటలు.. ఎములాడకు పోటెత్తిన భక్తులు

హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం వేలాది భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత అన్న పూజలసేవలను  అధికారులు రద్దు చేశారు. భక్తుల రద్దీ కారణంగా కోడెమొక్కులు చెల్లించుకునేందుకు ఐదు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం తీసుకుంటుంది.