Huawei smartphone: ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుందోచ్..

ఫోల్డ్, ఫ్లిప్ స్మార్ట్ఫోన్ల ప్రారంభం మొబైల్ రంగంలో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో అనేక ఫోల్డబుల్ డివైజ్లను విడుదల చేశారు. ఇది టెక్నాలజీ డిజైన్ ఇన్నోవేషన్లో ముందడుగు.గూగుల్ తన రెండో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయగా..శాంసంగ్ కూడా ఫోల్డబుల్ ఫోన్ వివరాలను వెల్లడించింది. అయితే ఈ రేసులో చైనీస్ టెక్ కంపెనీ హువావే కూడా ఉంది..Huawei  ట్రిఫుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ట్రిపుల్ ఫోల్డబుల్ గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చిన కంపెనీగా చరిత్ర సృష్టించాలని చూస్తోంది. 

GSMArenaలో ప్రచురించబడిన నివేదిక ప్రకారం..Huawei smartphone కంపెనీ CEO రిచర్డ్ రాబోయే ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ఫోన్ మోడల్ వివరాలను రివీల్ చేశాడు. ఈ ట్రైఫోల్డ్ స్మార్ట్ ఫోన్ లాంచింగ్ డేట్ కూడా చెప్పారు. వచ్చేనెలా అంటే సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. కొద్దిరోజుల్లో టీజర్ ను విడుదల చేస్తామన్నారు. 


ప్రస్తుతం ఈ ట్రైఫోల్డ్ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన వివరాలు అధికారికంగా రానప్పటికీ సోషల్ మీడియాలో పుకార్లు, ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో Huawei CEO యు ఫొటో వైరల్ అయ్యింది. పరికరం ఎడమవైపు స్క్రీన్‌పై సెల్ఫీ కెమెరా కోసం కేంద్రీకృత పంచ్-హోల్‌ను కలిగి ఉందని ఫొటో సూచిస్తుంది. Huawei Mate X5, vivo X Fold3 Pro , Samsung Galaxy Z Fold 6 వంటి సాధారణ ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో మనం చూశాం. రాబోయే ట్రైఫోల్డ్ స్మార్ట్ ఫోన్ రెండు కీలతో పరికరం రెండు క్రీజ్‌లను కలిగి ఉంది. పరికరం చేతిలో కూడా చాలా స్లిమ్‌గా కనిపిస్తుంది.

ఈ డివైజ్ మేట్ సిరీస్‌లోకి వస్తుందని , మేట్ 70కి ముందే లాంచ్ అవుతుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే మేట్ 70 లాంచ్ ఆలస్యం అయినందున ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ విడుదల కూడా ఆలస్యం అవుతుందంటున్నారు టెక్ నిపుణులు.