మహిళలు ఉదయం ఇంట్లో పనులు చేసుకొని ఆఫీస్ కు వెళుతుంటారు. ఆఫీస్ లో రోజూ ఏడెనిమిది గంటలు పని చేస్తారు. పని ఒత్తిడితో సాయంత్రం ఇంటికి రాగానే అలసటతో పిల్లలపై భర్తపై చిరాకు పడుతుంటారు. ఆఫీసులో చేసే పని కాస్త రిలాక్స్ ఉంటే సాయంత్రం ఇంటికి రాగానే హుషారుగా కనిపించవచ్చు. కాబట్టి మహిళలు ఆరోగ్యం మీద దృష్టి సారించాలి. కష్టపడి వ్యాయామం చేయకపోయినా సింపుల్గా ఉండే చిట్కాలను ప్రయత్నిస్తే చాలు.
- రోజూ అరగంట నడవాలి. అలాగే సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లకు లిఫ్ట్ ఎక్కే బదులు కాలి నడకన మెట్లు ఎక్కడం ద్వారా శరీరానికి వ్యాయామం అందుతుంది.
- మహిళల్లో గుండె వేగం నిమిషానికి 7580 ఉండాలి. కనుక యోగా చేయాలి. డంబెల్స్ తో కూడా వ్యాయామం చేయాలి. ఈ తరహా వ్యాయామాలు చేస్తే గుండెకు అందాల్సిన రక్తం సరఫరా అయి ఆరోగ్యంగా ఉంటారు.
- ఉదయంపూట టిఫిన్ నిర్లక్ష్యం చేయకూ డదు. అలానే ఆఫీస్ టైమింగ్స్ టీ, కాఫీ, గ్రీన్ టీ వంటివి సేవించాలి. తగినంత మంచినీళ్లు తాగుతూ ఉండాలి. రోజూ తీసుకొనే ఆహారంలో తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవాలి. తినటానికి టైం లేకపోతే ఆఫీస్ కు తీసుకెళ్లి తినొచ్చు.
- కంప్యూటర్ ముందు కూర్చొని ఉద్యోగం చేసే మహిళల్లో ఎక్కువగా చేతివేళ్ల నొప్పితో బాధపడతారు. అలాంటి సమస్య ఉన్నవారు జుట్టుకు ఉన్న రబ్బరుబ్యాండ్ తీసుకోవాలి. కుడి, ఎడమ చేతివేళ్లను దగ్గరకు చేర్చి బ్యాండ్ వేయాలి. బ్యాండ్ ను సాగదీస్తూ వేళ్లను దూరంగా దగ్గరకు జరపాలి. ఇలా 10-15 నిమిషాలపాటు చేయాలి.
- కూర్చొని వర్క్ చేసే మహిళలకు ఎక్కు వగా వెన్ను నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కుర్చీలో కూర్చున్నా లేదా నిల బడినా నిటారుగా ఉండాలి. కంప్యూటర్ స్క్రీన్ కంటికి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే మెడ, వెన్ను నొప్పులు రావు.
- అపుడప్పుడు కాస్త విరామం తీస్కోవాలి. విరామం తీస్కొని చేసే పనిలో నాణ్యత ఉంటుంది. అతిగా పనిలో నిమగ్నం అవ్వ డంవల్ల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది.
- వర్క్ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోండి. తద్వారా విసుగులేకుండా ఉంటుంది.
V6 వెలుగు