ఉగాది తర్వాత వర్షాలు ఎలా పడతాయి.. భూకంపాలు, యుద్ధాలు వస్తాయా..?

ఈ సంవత్సర వర్షములు సామాన్యము. 2 కుంచములు వర్షము 10 భాగములు సముద్రములందు, 7 భాగములు పర్వతములందు, 2 భాగములు భూమియందు వర్షములు పడును. పర్వతములపైన అధిక వర్షములు కురియును. యమునానది ఉగ్రరూపం దాల్చగలదు. నదులు, వాగులు, పొంగి ప్రవహించును. తుపానులు వస్తే వర్షములు కురిసినట్లుగా ఉండును. మన తెలుగు రాష్ట్రములలో నదులు ప్రమాదపుటంచుల వరకు ప్రవహించును. జలాశయములు కళకళలాడగలవు. అల్పపీడనములు, తుపానుల వలన అష్టకష్టములు పడగలరు.

చైత్రమాసం:  ఆకస్మిక వర్షాలు, చిరుజల్లులు, ఆకాశం, మేఘాలు కమ్ముతాయి. స్వల్ప వర్షపాతం. అధిక ఉష్ణోగ్రత ఉంటుంది.

వైశాఖమాసం: స్వల్ప వర్షములు, ఆకస్మికముగా తుపాను వచ్చే అవకాశాలు. ఎండలు చాలా తీవ్రంగా ఉండగలవు. ఆకస్మికంగా వడగండ్ల వానలు. ఒక మోస్తరు వర్షాలు పడును. పంటలకు కొన్ని ప్రాంతములలో నష్టములు జరుగును.

జ్యేష్టమాసం: అగ్నిప్రమాదములు, ఎండల తీవ్రత. చిరుజల్లులు, వడగండ్ల వర్షములు, ముందస్తు వర్షములు కురిసే అవకాశం.

ఆషాఢమాసం: అధిక వేడి, ఉక్కపోత. ఉరుములు, మెరుపులు. వర్షములు ఆకస్మికముగా కురియును. రాష్ట్రం అంతటా వర్షాలు పడవు.

శ్రావణమాసం: ఈ మాసములో వర్షములు సరిగా పడవు. అల్పపీడన తుపానుగా మారి రాష్ట్రమంతా భారీ వర్షములు కురియును.

భాద్రపదమాసం: వర్షములు సామాన్యంగా ఉన్నా అల్పపీడన తుపాను​గా మారి నదులు పొంగిపొర్లును. అధిక వర్షముల వలన జననష్టం.  

ఆశ్వీయుజమాసం: వర్షాలు సామాన్యం. కాని అనావృష్టి, అతివృష్టి అల్పపీడనం తుపాను​గా మారే అవకాశాలు. ఉక్కపోత. అక్కడక్కడ వర్షములు పడగలవు.

కార్తీకమాసం: ఒక మోస్తరు వర్షములు పడగలవు. అతివృష్టి, అనావృష్టి వలన వర్షములు చిరుజల్లులతో ఆకస్మికగా మారే లక్షణములు కలవు.

మార్గశిరమాసం: తుపాను తాకిడి ఉంటుంది. వర్షముల వలన పంటలకు నష్టములు కలుగును.

పుష్యమాసం: చెదురుమదురు వర్షములు, తుపాను ప్రభావం. చలి అధికం. పగటి ఉష్ణోగ్రతలు తక్కువ. 

మాఘమాసం: అనావృష్టి, పొగమంచు, అధిక మంచు వలన మామిడి పంటకు నష్టం. పూత రాలిపోవును. వాయుగుండం తుపాన్ ఉండవచ్చును. అధిక వర్షపాతము, భూకంపములు వచ్చే అవకాశాలు.

ఫాల్గుణమాసం: ఎండలు తీవ్రం. పడమర దేశాల్లో భూకంపములు, జననష్టములు. అనావృష్టి యోగము వలన అకాల వర్షములు.