కేవలం పదార్థాలు పాడవకుండా ఉంచేందుకు 'ఫ్రిజ్' ఉపయోగపడుతుంది అనుకుంటారు. చాలా మంది. అందుకే ఫ్రీజ్‌ని సరిగా మెయింటెయిన్ కూడా చెయ్యరు. అలాంటి వాళ్లు చాలా విషయాలు తెలుసుకోవాలి. ఫ్రిజ్ అరల్లో పదా ర్థాలను ఎలా పడితే అలా పెట్టకూడదు. ఫ్రిజ్ వెనుక భాగంలో... ఎక్కువ చల్లగా, ముందు భాగంలో తక్కువగా ఉంటుంది. మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలనుకునేవి, త్వరగా పాడవుతాయి అనుకునేవి మాత్రమే వెనుక భాగంలో పెట్టాలి. మామూలుగా చల్లదనం చాలు అనుకున్నవి ముందు పెట్టుకుంటే సరి పోతుంది. ఫ్రిజ్ అరల్లో ప్లాస్టిక్ షీట్లు వేయడం మంచిది.
అలా వేసుకోవడం వల్ల... గ్లాసు మీద మరకలు పడకుండా ఫ్రిజ్ పాడవదు. మనం రోజూ ఉపయోగించే పచ్చిమిర్చి, కరివేపాకును కనిపించే డబ్బాలో పెడితే బయటకు కనిపి స్తాయి. చాలామంది కూరగాయ ముక్కలు, పండ్ల ముక్కలు వంటివి మూతలు ఉన్న డబ్బాలో పెడుతుంటారు. అలా చేయడం వల్ల ఎక్కువ స్థలం వృథా అవుతుంది. థర్మోకోల్తో చేసిన ప్లేట్లు లేదా మందంగా ఉన్న టిఫిన్ ప్లేట్లలో ఉంచి కవరుతో ప్యాక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బయటకు కనిపిస్తాయి, తాజాగానూ ఉంటాయి. అలాగే ఫ్రిజ్ దుర్వా సన రాకుండా ఉండాలంటే వంట సోడాను కప్పులో తీసుకుని ఫ్రిజ్లో ఓ మూల ఉంచాలి.