టూల్స్​ & గాడ్జెట్స్​: ఆటోమెటిక్​ డస్ట్​బిన్​ ..ఎక్కడైనా ఈజీగా వాడొచ్చు

పిల్లలు ఉన్న ఇంట్లో డస్ట్​బిన్​ మెయింటెనెన్స్​ చాలా కష్టమైపోతుంది. కానీ.. ఈ డస్ట్​బిన్​ని పిల్లలు కూడా చాలా ఈజీగా వాడొచ్చు. ఇన్​స్టా కప్పా అనే కంపెనీ తీసుకొచ్చిన  ఈ ఆటోమెటిక్​ డస్ట్​బిన్​ మూతని టచ్​ చేయకుండానే తెరవొచ్చు. చేతిని మూత ముందు పెడితే చాలు.. మూడు సెకన్లలోనే మూత తెరుచుకుంటుంది. చెత్త వేసిన తర్వాత ఆటోమెటిక్​గా మూసుకుంటుంది. దీని మెయింటెనెన్స్​ కూడా తక్కువే.

ఇందులో రెండు ఏఏ బ్యాటరీలు వేస్తే సరిపోతుంది. తడి చెత్త వేసినా మెకానిజం పాడవకుండా ఉండేందుకు IPX5 వాటర్​ రెసిస్టెంట్​తో  దీన్ని డిజైన్ చేశారు. ఈ డస్ట్‌‌‌‌‌‌‌‌బిన్​ని మన్నికైన ఏబీఎస్​ ప్లాస్టిక్​తో తయారుచేశారు. 9 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. బాత్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌, బెడ్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌, కిచెన్‌‌‌‌‌‌‌‌.. ఇలా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. 

ధర రూ. 1,499